Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్ బెల్ట్
ఈనెల 18న జరిగే జేబీసీసీఐ-11వ వేజ్ బోర్డ్ సమావేశంలో అలవెన్స్‌లపై స్పష్టత ఇవ్వకుంటే బొగ్గు పరిశ్రమల్లో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఫ్‌ు (బీఎంఎస్) ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని సంఘం భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం భూపాలపల్లి ఏరి యాలోని కేటికే-1గనిలో ఆయన పర్యటించి మాట్లాడా రు. కార్మికులకు 19 శాతం మినిమం గ్యారెంటీ బెన్ఫిట్ (ఎంజిబి) మాత్రమే అంగీకారం కుదిరిందని, మిగిలిన అన్ని అంశాలపై యాజమాన్యం ఈ నెల18 న కలకత్తా లో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని డిమాం డ్ చేశారు. కొంతమంది ఉన్నతాధికారులు కావాలనే ఫిబ్రవరి 10, 2023న కలకత్తా హైకోర్టు తీర్పు తర్వాత కూడా వేజ్ బోర్డు 9వ సమావేశాన్ని ఆలస్యం చేశారని తెలిపారు. వేజ్ బోర్డు సమావేశంలో అన్ని సంఘాల సమ న్వయంతో బీఎంఎస్ 11వ వేతన సవరణ ఒప్పందాన్ని పూర్తి చేసిన తర్వాతే మంత్రిత్వ శాఖ ఆమోదానికి పం పాలని ప్రయత్నిస్తోందన్నారు. కొంత మంది అజ్ఞానులు, కొన్ని స్వార్థపర సంఘాలు 19 శాతం ఎంజిబి అమలు చేయలేదని బీఎంఎస్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ బొగ్గు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బిఎంఎస్ ఇతర అన్ని యూనియన్లను సమన్వయం చేసి కార్మికుల ప్రయోజనాలను దష్టిలో ఉంచుకుని పూర్తి సెటిల్మెంట్ను ఖరారు చేసేలా కోల్ ఇండియా మేనేజ్ మెంట్‌పై ఒత్తిడి తెచ్చామన్నారు. దీంతో ఈ నెల 18న అలవెన్సులపై జేబీసీసీఐ 11వ సమావేశం నిర్వహి స్తు న్నారని అన్నారు. భూపాలపల్లి ఏరియా లో అధికారుల నిర్లక్ష్యం వల్లే భూగర్భగనుల్లో ఉత్పత్తికి అంత రాయం కలుగుతుందని అన్నారు. తద్వారా లక్ష్యసాధ నలో ఏరియా వెనుకబడుతున్నదని ఆరోపించారు. ఎస్డిఎల్ యంత్రాలకు విడిబాగాలు అందుబాటులో లేకపోవడం, బొగ్గు నింపటానికి ఖాళీలు సరిపడు లేకపోవడం, డిస్ట్రిక్ పని స్థలాల్లో పనులు, వసతులు మెరుగు పర్చకపోవం, తదితర వాటిలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వసతుల కల్పనలో ఉద్యో గులకు సహకరించి ఉత్పత్తి లక్ష్య సాధనపై దృష్టి సారిం చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓరం లక్ష్మణ్, అన్నం శ్రీనివాస్, కే భాస్కర్, అల్లం శ్రీనివాస్,లక్ పతి,ఓదెలు తదితరులు పాల్గొన్నారు.