Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతం త్య్ర సమర యోధులు, భారత మాజీ ఉప ప్రధాని డ్క్టార్ బాబూ జగ్జీవన్ రామ్ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ అన్నారు. బుధవారం జగ్జీవన్రామఖ్ 116వ జయంతి సందర్భంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. అనంతరం చీఫ్‌విప్ మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల నేత జగ్జీవన్ రామ్ అని అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ స్మరించుకుని, ఆయన ఆశయ సాధనకు కృషిి చేయాలని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత జగ్జీవన్ రామ్ అన్నారు. తర తరాలుగా సామాజిక ఆర్థిక వివక్షకు గురౌతున్న దళిత సమాజాభివద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం పాటుపడు తున్నదని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయాల సాధన దిశగా దళిత బంధు వంటి పథకాలను అమలు చేస్తున్నదన్నారు. తద్వారా సామాజిక ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృష చేస్తున్నద న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మైనార్టీ కమిషన్ మెంబర్ దర్శన్ సింగ,్ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ బాబు, కుడా చైర్మన్ సుందర్ రాజు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ వాస్ చంద్ర దళిత సంఘ నాయకులు మంద కుమార్, మంద సంపత్, అంకేశపు రామచందర్, సింగారపు రవి తదితర దళిత, ప్రజాసంఘాల నాయకులు కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.