Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వ ర్యంలో భారత ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను బుధ వారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో అధ్య క్షుడు బసారికారి హరికృష్ణ ఆధ్వర్యంలో కా ర్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ జగన్ మోహన్‌రెడ్డి, బుచ్చం పేట మాజీ సర్పంచ్, అంబేద్కర్ యువజన సంఘాల జిల్లా నాయకుడు పగిడిపల్లి వెం కటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్టు ఎర్రం స్వామి యాదవ్, హాజరై బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలేసి నివాళులర్పించి మాట్లాడారు. బీహార్‌లోని షహనాబాద్ జిల్లాలో నిరుపేద దళిత రైతు కుటుం బంలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో అంచలం చలుగా ఎదిగి కేంద్ర మంత్రి, భారత ఉప ప్రధానిగా రాజకీయాల్లో రాణించారని కొని యాడారు. అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు గంగెర్ల రాజారత్నం, ఏంపెల్లి సమ్మయ్య, కర్రి శ్యాంబాబు, ఏంపెళ్లి వీరస్వామి, పరికి శ్రీను, పూల నరేష్ బోడ బొర్రయ్య, బోడ రామచంద్రం, గోన నాగేష్, కోటి రాము, ప్రవీణ్, బాసారి నాగార్జున, చిట్యాల రాజశేఖర్, దాసరి నరేష్, సురేష్, ముకుందం పాల్గొన్నారు.
వాజేడు : జగ్జీవన్ రారు 116వ జయంతి వేడుకలు వాజేడు మండల ప్రభు త్వ వైద్య శాలలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ని వాళులు అర్పించారు. అనంతరం వైద్యాధి కారి కోరం మహేందర్ మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నేత డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్, దేశ స్వాతంత్య్రం, సామాజిక సమా నత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసి న ఆదర్శనేత అని కొనియాడారు. జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కషి చేయాలని అన్నారు. డాక్టర్ మధుకర్, సిహెచ్ సూర్య ప్రకాశరావు, వైద్య సిబ్బంది కోటిరెడ్డి, చిన్న వెంకటేశ్వర్లు, శేఖర్, రాజేష్, సుధాకర్, ఏఎన్ఎం లలిత కుమారి, ఛాయిదేవి, నాగేంద్ర కుమారి, కన్యాకుమారి, రాజేశ్వరి,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ అంటరానితనం నిర్మూలనకు ఎంత గానో కృషి చేసి నిర్మూలించారని మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా ఇన్చార్జి ఎరువు పైడి అన్నారు. బుధవారం మం డలంలోని పసర ఎంఎస్పీ కార్యాల యంలో ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను పార్టీ సీనియర్ నేత మడిపల్లి శ్యాంబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఇరుగు పైడి మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ మండల నాయకులు గ్రామ నాయకులు వంగ శ్రీను, తిక్క దుర్గారావు, పసల సమ్మయ్య, తోకల రాంబాబు,సుంచు యాకూబు,మునిగాల సాంబయ్య , కోతి సుధాకర్, రంజిత్, మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు సమ్మయ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.
జగ్జీవన్‌రామ్ ఆశయాలు గొప్పవి
బహుభాషా కోవిదుడైన బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు చాలా గొప్పవి ఉన్నతమైనవని ఎంపీపీ సూడి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని మండల పరిషత్ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీలు గుండబోయిన నాగలక్ష్మి, శ్రీమతి చాపల ఉమాదేవి, గోపి దాస్ ఏడుకొండలు, కో ఆప్టేడ్ మెంబర్ మొహమ్మద్ బాబర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తాడిచెర్లలో...
మల్హర్రావు : మండల కేంద్రమైన తాడిచెర్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కేసారపు నరేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వ హించారు. జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేష్, రామిడి గట్టయ్య, కరోబార్ అజ్మత్ అలీ, రామిడి శ్రీనివాస్ బండి మల్లయ్య పాల్గొన్నారు.
కేటీపీపీలో
గణపురం : గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో బుధవారం జగ్జీవన్ జయంతి వేడుకలను చీఫ్ ఇంజనీర్ ముస్త్యాల సిద్ధయ్య ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. సిఇ సిద్ధయ్య పాల్గొని మాట్లాడారు. అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు అడ్మినిస్ట్రే టివ్ పీవీవీ మురళి మోహన్, ఎస్ఇ ఓం ఎంఐ ఐవిఎల్ కోటేశ్వరరావు. ఎస్ఇ సిహెచ్ పిజే రామకృష్ణ, ఎస్ఇ సివిల్ ఇంచార్జి కూచిపూడి నాగేంద్రం, ఇంజనీర్స్ వినోద్, రవి, రవీందర్ నాయక్, మాకుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు
కన్నాయిగూడెం : బుట్టాయిగూడెం గ్రామపంచాయతీలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతిని ఘనంగా నిర్వ హించారు. సర్పంచ్ కావేరి పద్మ హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నేత కావేరి చిన్నికష్ణ బుట్టాయి గూడెం ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ సునార్కాని నరసింహారావు, అంగనవాడి టీచర్స్ జ్యోతి, రమాదేవి శోభన్ బాబు ,మాజీ సర్పంచ్ మహంకాళి, జనగం రవీందర్, వెంకటయ్య జీపీ కార్యదర్శి ప్రవీణ్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అ ధ్యక్షులు వెంకటయ్య పాల్గొన్నారు.
మహాదేవపూర్ : మండల కేంద్రంలో ని సామాజిక ఆసుపత్రిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బెల్లంపల్లి సురేష్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పార్ల మెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయడంలో కీలకపాత్ర వహించిన మహనీ యులు జగ్జీవన్ రామ్ అని అన్నారు. మహనీయుని అడుగుజాడలో నడవాలని వారు చేసిన సామాజిక ఉద్యమాలను ఆద ర్శంగా తీసుకొని నేటి తరం ముందు వరు సలో ఉండాలన్నారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జడ్పిటిసి గుడాల అరుణ, సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు అన్కారి ప్రకాష్,సూరారం సర్పంచ్ నాగుల లక్ష్మా రెడ్డి, పలిమేల సర్పంచ్ జవ్వాజి పుష్పలత చిలక రమేష్, దళిత సంఘాల సీనియర్ నాయకులు ధర్మయ్య, జక్కయ్య, శివరాజు, సమ్మయ్య, రవితేజ, ఎమ్మార్పీఎస్ మహాదే వపూర్ టౌన్ ప్రెసిడెంట్ కుమార్, ఎడపల్లి గ్రామ అధ్యక్షులు రాజశేఖర్ పాల్గొన్నారు
ఎమ్మెస్సీ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో
ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తూటిచెర్ల దుర్గయ్య ఆద్వర్యం లో మహాదేవపూర్ మండలం కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ ఆవరణలో బుధవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జెడ్పిటిసి గుడాల అరుణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మహనీ యుల చిత్ర పటాలకు పూలమాలవేసి నివాళుల ర్పించారు. మహాదేవపూర్ ఎస్సై 2 భవాని సేన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాం గం రాసి చట్టాలను రూపుదిద్దేతే ఆ చట్టా లన్నింటినీ కూడా పార్లమెంటులో అమలు చేసిన ఘనత జగ్జీవన్ రామ్దేనని కొని యాడారు. గ్రంథాలయ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు సంఘసంస్కర్త జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయ కుడు కొయ్యల సత్యం మాట్లాడుతూ మహ నీయులను స్మరించుకోవాలని అన్నారు. సాయిబాబా ఆలయ చైర్మన్ మెరుగు లక్ష్మణ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు లింగాల రామయ్య, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు ఆయిల సమ్మయ్య, వీఆర్ఏల మండల అధ్యక్షుడు మెరుగు సమ్మయ్య బాలరాజు, మాల మహానాడు మండల అధ్యక్షుడు మల్లేష్, యాదవ సంఘం సంఘం యూత్ మండల అధ్యక్షుడు పిడుగు బాపు, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు నిఖిల్ పాల్గొన్నారు. అలాగే డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతిని మహాదే వపూర్ మండలంలోని సూరారం గ్రామం లో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. యువకులు నిరంజన్, దేవేందర్, అజరు, శ్రావణ్, లడ్డు, అభిషేక్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.