Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెల్ ఫోన్లో 'బండి' బండారం అంతా..
- 'నమో' మోర్చతో కేసీఆర్ ప్రభుత్వంపై కుట్రలు
- ఉపాధి హామీకి వ్యవసాయాన్ని అనుసంధానికై 'ఉత్తర యుద్ధం'
- రాష్ట్ర పర్యటన కొచ్చే ప్రధాని మోడీ స్పందించాలి
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సెల్ఫోన్లోనే బండారం అంతా దాగి ఉం దని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువా రం క్యాంప్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి, నైతికత ఉంటే 10 తరగతి పరీక్ష పత్రాల లీకేజీ కేసు లో ఏ1 నిందుతుడిగా అరెస్టు అయిన ఎంపీ బండి సంజయ్‌ని భర్తరఫ్ చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షుడి పదవీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశా రు. తెలంగాణలో బీజేపీ మతతత్వ ఘర్షణలు ప్ర యోగించినా ఇక్కడ ఎవరు పట్టించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో బదనాం చేసి అడ్డదారిలో అధి కారంలోకి రావడానికి పన్నాగం పన్నుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ను అంతం చేయాలని ఢిల్లీ డైరెక్షన్ ఇస్తే రాష్ట్ర బీజేపీ యాక్షన్ చేస్తుందన్నారు. టీఎస్పీ ఏస్సీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రం లో ఇవ్వని నోటిఫికేషన్లు ఇచ్చి 1.50లక్షల ఉద్యోగా లను నియమాకం చేసిందని తెలిపారు. ఎప్పుడు లేని విధంగా ఇటివలనే ప్రశ్న పత్రాల లీకేజీలు అవు తున్నాయో తెలంగాణ సమాజం గుర్తిస్తుంద న్నారు. లక్షలాది మంది విద్యార్థు లు, యువత భవిష్యత్‌తో బీజేపీ తన స్వార్థపూరి తా నికి బలిచేసేందుకు పూనుకుందని ధ్వజమెత్తారు. బీ జేపీ తన అనుబంధ 'నమో' మోర్చతో రాష్ట్ర ప్రభు త్వంపై కుట్రలు చేస్తుందని ఎద్దేవజేశారు. ఇందుకు నిదర్శనమే కమలాపురంలో పేపర్‌లీక్ బండారమ న్నారు. లీకేజీకి కర్త, కర్మ, క్రియ అంతా బండి సంజయ్ అనే తేలిపోయిందన్నారు. ప్రశాంత్ అనే నిందు తుడితోముందుగా మాట్లాడిందంతాఉందన్నా రు. సెల్ఫోన్లో బండారం బయటపడుతుందని పో యిందంటూ బుకాయిస్తున్నాడన్నారు. బండి నీ చరి త్ర అంతా సెల్ ఫోన్లో ఉందని, కొంత ఆలస్యమైనా పోలీసులుచట్టప్రకారం విచారణ చేసి కొద్ది రోజుల్లో నే తేల్చనున్నారని తెలిపారు.
బాధ్యతయుతమైన ఎంపీ పదవీలో ఉండి బం డి సంజరు దురుద్దేశ్యం పూర్వకంగా నమో మోర్చకు చెందిన ప్రశాంత్ నుంచి సమాజానికి నష్ట వాటిల్లే కీలకమైన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఉసిగొల్పాడ న్నారు. పదవి ప్రమాణాన్ని బండి తుంగలో తొక్కి అనైతికతకు దిగజారాడని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బండి సంజరు తోడు దొంగ లేనని..ఇప్పటి వరకు బండి వ్యవహారంపై మాట్లా డకపోవడమే ఇందుకు నిదర్శనమని దుయ్యపట్టారు. ప్రధాని మోడీ ఎన్నికల కమిషనర్‌ను మోసగించాడ ని తనపై వచ్చే డిగ్రీ సర్టిఫికెట్ల నకిలీ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పర్యట నకు వస్తున్న మోడీ ఉపాధి హామీ పథకంలో వ్యవసా యాన్ని అనుసంధానం చేస్తారో లేదో తేల్చి చెప్పాల న్నారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గిండం, కూలీల కు పనిదినాలను మెరుగపర్చాలని తెలంగాణ అసెం బ్లీ తీర్మాణం చేసి కేంద్రానికి పంపిస్తే ఇప్పటి దాకా స్పందించకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర పర్యటకు వస్తున్న మోడీ సమాదానం చెప్పాలన్నారు. ఇందుకోసం నియోజకవర్గం నుంచి ఉత్తర యుద్ధం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
2లక్షల జాబ్ కార్డుదారులచే ఈ ఉత్తర యద్ధం చేయనున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సంసి ద్ధం కావాలని కోరారు.
ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాయిడి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ క్లస్టర్ ఇన్చార్జిలు మునిగాల వెంకట్ రెడ్డి, నల్లా మనోహర్ రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, గుంటికిషన్, దార్ల రమాదేవి, వే ములపెల్లి ప్రకాశ్‌రావు, వెంకట్రామం నర్సయ్య, గుం టుక సోమయ్య, బత్తిని శ్రీనివాస్, మండల శ్రీనివా స్, వేణుముద్ధల శ్రీధర్ రెడ్డి, గోనె యువరాజు తదిత రు లు పాల్గొన్నారు.