Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
ప్రపంచ ఆరోగ్యదినోత్సవాన్ని పుర స్కరించుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ-వరంగల్ చైర్మన్, వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.రాధాదేవి గురు వారం మండలంలోని లోహిత గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచి త వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానన్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలందరూ మెరుగైన ఆరోగ్యంతో జీవించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్యశిబిరం నిర్వహించామని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండడా నికి సరిపడా నిద్ర, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం, సరిపడ నీరుతాగడం, మానసిక ఒత్తిడికి దూరం గా ఉండడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. వైద్య నిపుణుల సలహాలన నుసరించి ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామాలు చేస్తూ, పౌష్టికాహారం తీసుకో వాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అశ్వినీతానాజి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని, గ్రామం లోని, చుట్టుపక్కల ప్రజలందరూ అంటే పిల్లలు, వృద్ధులు, మహిళలు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించుకుని, ఉచితంగాఔషధాలు తీసుకుని, ఆరోగ్యవంతమైన జీవ నం గడపాలని కోరారు. న్యాయ అధికార సంస్థ కార్యదర్శి జే.ఉపేందర్‌రావు మా ట్లాడుతూ 'జాతీయ,రాష్ట్ర న్యాయ సేవాఅధికార సంస్థల కార్యాచరణ లలో భాగం గా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దే శంతో ప్రభుత్వ వైద్యాధికారుల సహకారంతో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు సేవలందిస్తారని తెలిపారు. ఈవైద్య శిబిరంలో వైద్య సలహాలు, సూచనలతో పాటు న్యాయపరమైన సలహా లు కూడా పొందవచ్చును అని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 450 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత ఔషధాలు పంపిణీ చేసినట్లు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జే.ఉపేందర్ రావు తెలియజేశారు. ఈ శిబిరంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, అదనపు వైద్యశాఖ అధికారి గోపాలరావు, న్యాయ సేవాధికారసంస్థ సభ్యులు ఈ.వి.శ్రీనివాసరావు, లోహిత గ్రామ నాయకులు జగ న్మోహన్రావు, హెచ్ఎం అంజివర్ధన్రెడ్డి, ఎంజీఎం, సీకేఎం.హాస్పిటల్ వివిధ రంగాలకు చెందిన డాక్టర్లు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ ఆర్.సురేష్, న్యాయవాదులు ఆర్.రజిని, జన్ను ఆనంద్, శశిరేఖ, అచ్యుత్, రామచంద్రపురం, షాపురం, పెద్ద తండా గ్రామాలసర్పంచులు దిలీప్‌రావు, సట్ల రాజు, గుగులోతు రవి, ఏఎన్ ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, లోహిత చుట్టుపక్కల గ్రామా ల ప్రజలు పాల్గొన్నారు.