Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
పార్టీ కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీకి బలం, కష్టప డే కార్యకర్తలు పార్టీకి దొరకడం అదష్టమని వారి బ లంతోనే మూడోసారి ముచ్చటగా అధికారం తీసుకు రావడానికి ప్రతిఒక్క కార్యకర్త కంకణం కట్టుకోవాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మండలాలకు చెందిన బీ ఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఊకల్ క్రాస్ లో ఉన్న ఎస్ఎస్గార్డెన్స్లో పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అ తిథిగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీ హరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మా రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బల మన్నారు. పార్టీని మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలం దరూ కృషి చేయాలని కో రారు. రాష్ట్ర ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షేమ ప థకాలను ప్రజల్లోకి తీసుకె ళ్లాలని సూచించారు. కేం ద్రం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కూ డా వివరించాలన్నారు. పె ట్రోల్, డీజిల్,గ్యాస్, నిత్యా వసర సరుకుల ధరలు పెంచి సామాన్యుడిని దోచుకుంటున్నదని మండిపడ్డా రు. దేశంలో మరే రాష్ట్రంలో లేని పథకాలు మన వద్ద అమలవుతున్నాయని గుర్తు చేశారు.
రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలి : కడియం
కడియం శ్రీహరి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టి పేదలను మోసంచేస్తున్నదని మండిపడ్డారు. కార్యక ర్తలే పార్టీకి బలమని, రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ కొ ట్టేందుకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చా రు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని సూచించారు. కొం డను ఢకొీట్టిన ఘనత మీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిదేన న్నారు. ఇలాంటి శక్తి వంతమైన చల్లాను మరోసారి గె లిపించుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చేసారి ప్రమో షన్ ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, జడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి,ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి,జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పులుగు సాగర్ రెడ్డి,మాజీ ఎంపిపి కక్కేర్ల సదానందం, చైర్మన్ వేల్పుల కుమారస్వామి, వైస్ యంపిపి బుక్క మల్లయ్య,గుగులోత్ వీరమ్మ,అనిల్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, యూత్, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు
గురువారం మండలంలోని పల్లారుగూడ, పో చమ్మతాండాకి చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెం దిన 60 మంది నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో గీ సుగోండ మండలం ఊకల్ గ్రామ సమీపంలోని ఎస్ ఎస్ గార్డెన్స్‌లో జరిగిన పార్టీ సమ్మేళనంలో చేరారు. వారికి ఎమ్మేల్యే గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి,ఎంపీపీ కందగట్ల కళావతినరహరి, కక్కె ర్ల సదానందంగౌడ్, జిల్లాసర్పంచుల ఫోరం అధ్యక్షు డు పులుగు సాగర్‌రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అ ధ్యక్షుడు పసునూరి సారంగపాణి, సర్పంచులు కక్కెర్ల కుమారస్వామిగౌడ్, కోడూరి రజిత రమేష్, రజిని రా ము, మండల మండల ప్రజా ప్రతినిధులు, నాయకు లు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.