Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డిని అరెస్టుకు నిరసనగా టీపీసీ సభ్యుడు కాంగ్రె స్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్య క్షుడు బండం శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ముఖ్య మంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లా డుతూ రాష్ట్రంలో లీకేజీ, ప్యాకేజీ వ్యవస్థ నడుస్తుం దని, చివరికి విద్యార్థుల జీవితాలతో కూడా కేసీఆర్ కుటుంబం సొమ్ము చేసుకుంటుందని విమర్శిం చారు. కేసీఆర్ పాలనలో దేశంలోనే నెంబర్ వన్ లీకేజీ ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇంతసేపు లీకేజీ ప్యాకేజీ, నరేంద్ర మోడీ పంపే కుట్రలను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కుట్రలు పన్ను తూ, ఒకరు 30 లక్షల మంది విద్యార్థుల ఆత్మగౌ రవంతో ఆడుకుంటే చేసిన తప్పును రూపుమా పడం కోసం బండి సంజరు తో కలిసి కొత్త నాట కానానికి తెరలేపి రాజకీయ పబ్బం గడుపుకుం టున్నారని అన్నారు. చివరికి విద్యావ్యవస్థను కూడా తమ కుటుంబ సొంత లాభానికి వాడుకున్న వారిలో కేసీఆర్ మొదటి స్థానంలో ఉంటారని వి మర్శించారు. శివసేన రెడ్డి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించడాన్ని ఖండించాలన్నారు. శివసేన రెడ్డిని బేషరతుగా విడుదల చేసేంతవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. 30 లక్షలమంది నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ వారికి ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఇటీవల లీకేజీ గురైన విద్యార్థులు కూడా ఎటువం టి ఒత్తిడికి లోను కాకుండా బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న రాజకీయ క్రీడలో విద్యార్థులు బలి కావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు తోట రంజిత్, నగునూరి రజినీకాంత్, పధ్విరాజ్, ఉడుత మహేందర్, చరణ్,కిషోర్ రెడ్డి, చుంచుల మహేష్, వెంకీ యాదవ్, శ్రీకాంత్,బడితెల ప్రసాద్,వైనాల యశ్వంత్, ఆప్పాల శ్రీనివాస్ దుర్గం ఆంజనేయులు, తోకల అరవింద్, పండుగ రమణ,దోర్నాల భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.