Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీవో అంకిత్
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటిడిఏ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ,సిబ్బంది వారి టార్గెట్లను త్వరితగతిన అధిగమించాలని ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశించారు. ఐటిడిఏ కార్యా లయంలో గురువారం ఆయా ప్రాథమిక కేంద్రాల వైద్యులు, సిబ్బందితో పివో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మాత శిశు సంరక్షణ ప్రోగ్రాంలో భాగంగా పిహెచ్సీ వైద్యులకు మార్చి నెలలో ఇచ్చి న టార్గెట్లను అడిగి తెలుసుకున్నారు. కాగా కొన్ని పీహెచ్సీల నుండి అనుకొనంత మేర స్పందన లేక పోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నా యిగూడెం, వెంకటాపురం, మంగపేట, రొయ్యూ రు, గోవిందరావుపేట పీహెచ్సీల వైద్యులు ఏప్రిల్ లో వారి టార్గెట్లను పూర్తి చేసుకోవాలని సూచిం చారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, ప్రోగ్రాం అధికారి వెంకటేశ్వరరావు, ఐదు పీహెచ్సీల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.