Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి/ములుగు/ సుబేదారి/వరంగల్
ఏప్రిల్ 14న అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ విజయవంతం చేసేందుకు పక డ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి శాంతి కుమారి అన్నారు. గురువారం హైద రాబాద్ నుండి రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులతో కలిసి గొర్రెల పంపిణీ, అంబేద్కర్ జయంతి వేడుక లపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహిం చి సమీక్షించారు. రాష్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యే లా చర్యలు తీసుకో వాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ ని యోజకవర్గం నుంచి 6 బస్సులతో ప్రజలను తరలిం చాలని అన్నారు. మండల కేంద్రం నుంచి బస్సులు నడ పాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజలు చేరుకునేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఆ రోజు టిఫిన్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు చేయాలని, ప్రతి బస్సులో పోలీస్ అధికారి, ప్రభుత్వ అధికారిని నియ మించి బాధ్యతలు అప్పగించాలన్నారు. బస్సు తిరిగి మండల కేంద్రాలకు చేరే వరకు జిల్లా స్థాయిలో మానిటరింగ్ చేయాలని అన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని, అవసరమైన ఏర్పాట్లు జిల్లాలో పూర్తి చేయాలని తెలిపారు. రెండవ విడత కింద ఎంపిక చేసిన 3.38లక్షల లబ్దిదారులలో మరణిం చిన వారి నామిని వివరాలు సేకరించి వారికి గొర్రెల యునిట్లు పంపిణీ చేయాలని అన్నారు. రెండవ విడత గోర్రెల పంపిణీ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ లబ్దిదారున్ని వాటా సేకరించాలని, గోర్రెల కోనుగోలు కోసం వెళ్ళెందుకు సీనియర్ అధికారి నియమించాల న్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, ఆర్డీవో శ్రీనివాస్, ములుగు కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ వైవీగణేష్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులకు గొర్రెల పంపిణీ, అంబేద్కర్ జయంతిపై పలు సూచనలు చేశారు. గొర్రెల పంపిణీపై మండల ప్రత్యేక అధికారులు, సోసైటి సభ్యులు, లబ్దిదారులకు అవగాహన కార్యక్రమాలు 7 రోజుల్లో పూర్తి చేయాలని, లబ్దిదారుల నుండి వాటా సేకరణ ప్రారంభించాలని తెలిపారు. హైదరా బాద్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అసెంబ్లీ ని యోజకవర్గం నుంచి ప్రజల తరలింపులో స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఇందులో పాల్గొనే ప్రజల వివరాలు సేకరించాలని, ప్రతి మండల పరిధిలో వెళ్ళె బస్సులో అవసరమైన స్నాక్స్, వాటర్ బాటిల్, బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి మండల కేంద్రంలో ఉదయం 6గంటల వరకు బస్సు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 11 తేదిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. 14న అంబేద్కర్ జీవిత చరిత్ర డాక్యుమెంటరీ ప్రదర్శన కోసం ఏర్పాటు చేయా లన్నారు. జెడ్పీ సీఈఓ ప్రసన్నారాణి, డీపీఓ వెంకయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, డి వి హెచ్ ఓ విజయభాస్కర్, ఆర్టీసీ ములుగు కంట్రోలర్ ప్రభాకర్ పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో వాసుచంద్ర, పరకాల ఆర్డీవో రాము, డీఆర్డీఎ పీడీ శ్రీనివాస్, ఎససి సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి నిర్మల,ఆర్టివో పురుషోత్తం, ఎంపీడీఓ రవిబాబు, తదితర అధికారులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నుండి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకాడే, అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీవత్స కోట కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమా వేశ మందిరం నుండి పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభి స్తారని, దానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు జిల్లాలో పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. రెండవ విడత క్రింద ఎంపిక చేసిన 3.38 లక్షల లబ్దిదారులలో మరణించిన వారి నామిని వివరాలు సేకరించి వారికి గొర్రెల యునిట్లను పంపిణి చేయాలని అన్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజల తరలింపు సంబం ధించి స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పాల్గోనే ప్రజల వివరాలు ఏప్రిల్ 10 నాటికి సేకరించాలని, ప్రతి మండల పరిధిలో వెళ్ళె బస్సులో అవసరమైన స్నాక్స్, వాటర్ బాటిల్, బ్రేక్ ఫాస్ట్ స్థానిక తహసిల్దార్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ సంపత్రావు, ఆర్డిఓ మహేందర్ జి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.