Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి,
- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పీవీపీ లలితా శివజ్యోతి
నవతెలంగాణ - ములుగు
ప్రజలంతా మెరుగైన ఆరోగ్యంతో జీవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా సేవాధికార సంస్థ చైర్మన్ పీవీపీ లలితా శివ జ్యోతి అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల సూచనల మేరకు గురువారం జిల్లా న్యాయ సేవా అధికార సంస ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ప్రభుత్వ ఆస్పత్రులు, ములుగులో నెలకొన్న సమస్యలపై అ వగాహన సదస్సు, మెడికల్ క్యాంపు నిర్వహించారు. పివిపి లలితా శివ జ్యోతి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ మెరుగైన ఆరోగ్యంతో జీవించాలనే ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన థీమ్ హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సార్స్, మలేరియా, ఎయిడ్స్, కోవిడ్- 19 వంటి ప్రాణాంతకమైన అంటూ వ్యాధులను అరికట్టడానికి కృషి చేస్తుందన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు రక్షిత మంచినీటి సరఫరా అత్యవసర సమయంలో ఆరో గ్యకరమైన అంశాలపై కోఆర్డినేషన్ వాతావరణం లో వచ్చే మార్పులను అధిగమించాలని అన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేస్తూ పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమన్నారు. కోవిడ్ -19 కారణంగా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగిందన్నారు. అనంతరం ఇన్ పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి కమ్ కార్యదర్శి టి మాధవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి జగదీశ్వర్, బార్ అసోసియేషన్ ములుగు ప్రెసిడెంట్ సీహెచ్ వేణుగోపాలచారి, ఏజీపీ బి చంద్రయ్య, అడ్వకేట్లు సునీల్‌కుమార్, స్వామిదాస్ రాజేందర్, రవీందర్, డాక్టర్ రఘు, డాక్టర్ గణేష్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆరోగ్య మేరీ పాల్గొన్నారు.