Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీ అసోసియేషన్ నాయకుల పరస్పర దాడులు
- పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదులు
నవతెలంగాణ-గణపురం/భూపాలపల్లి
భూపాలపల్లి లారీ అసోసియేషన్ సభ్యులు, గణపురం లారీ అసోసియేషన్ సభ్యులు పర్సపరం దాడులు చేసుకున్నట్లు సమాచారం. దెబ్బలుతిన్న గణపురం అసోసియేషన్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని బస్వరాజు పల్లి కేటీకే 8 ఇంక్లైన్, ఓసీ త్రీలో గణపురం లారీ అసోసియేషన్‌కు కాకుండా భూపాలపల్లి లారీలకు సింగరేణి యాజమాన్యం అనుమతి ఇచ్చింది. దీంతో బుధవారం రాత్రి గణపురం లారీ అసోసియేషన్ కేటీకే 8 ఇంక్లైన్, ఓసీ త్రీ వద్ద స్థానికేతర లారీలను అడ్డుకున్నామన్నారు. ఈ విషయమై గురువారం భూపాలపల్లి జీఎం ఆఫీసు వద్ద చర్చకి రావాలంటూ గణపురం అసోసియేషన్ సభ్యులను భూపాలపల్లి లారీ అసోసియేషన్ సభ్యులు ఆహ్వానించారు. చర్చల అనంతరం తిరిగి వస్తుండగా భూపాలపల్లి లారీ అసోసియేషన్ సభ్యులు వారి కార్యాలయం వద్ద అడ్డగించి మహేందర్, గండ్రతి సురేందర్, సతీష్ దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని చెప్పారు. సురేందర్, సతీష్‌ను రూంలో బంధించగా.. వారు 100కు ఫోన్ చేశారని, దీంతో పోలీసులు వచ్చి కాపాడినట్లు చెప్పారు. ఈ ఘటన అనంతరం భూపాలపల్లి లారీ అసోసియేషన్ సభ్యులు కొంత మంది మళ్లీ లారీలో వచ్చి గణపురం అసోసియేషన్ సభ్యులపై దాడి చేస్తున్న క్రమంలో అన్నం జగ్గారావు తలకు గాయాలయ్యాయి. అలాగే క్షతగాత్రులమైన తమను పరామర్శించేందుకు వస్తున్న చలపతి రావుపై రామప్ప క్వాటర్స్ వద్ద మళ్లీ దాడికి దిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఇటు గణపురం అసోసి యేషన్ సభ్యులు గణపురం పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటన పై ఫిర్యాదు చేస్తుండగా.. భూపాల పల్లి లారీ అసోసియేషన్ సభ్యులు భూపాలపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం భూపాలపల్లి, గణపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..