Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు ఇబ్బంది లేకుండా కేంద్రాల నిర్వహణ
- ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు
- మిల్లర్లు, కాంట్రాక్టర్లు, అధికారులతో కలెక్టర్ సమీక్ష
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ళకు పకడ్బంధీగా చర్యలు తీసుకుంటున్నామని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చే స్తుందని, ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్న ట్లు జిల్లాకలెక్టర్ సిహెచ్.శివలింగయ్య చెప్పారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారు లు, ప్యాడీ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లతో జరిగినసమీక్షా సమా వేశంలో ఆయన అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 -23 యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలుకు జిల్లా యం త్రాంగం సిద్దంగాఉండాలన్నారు.జిల్లాలోఐకెపి ద్వారా 111, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 89, మొత్తం 200 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జి ల్లా యంత్రాంగం ఇప్పటికే నిర్ణయించిందని, 32 లక్షల గన్నీ స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయా కేంద్రాల్లో కావల్సిన సౌకర్యాలు వెయింగ్ మిషన్స్, టార్ఫాలిన్స్, గన్నిస్, మాయిశ్చర్స్ మీటర్లు, ప్యాడీ క్లీనర్స్ తదితర మౌళిక వసతు లను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనా మేరకు ఈ సంవత్సరం యాసంగి లో 2 లక్షల, 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చునని, జిల్లాలో 18 బాయిల్డ్, 33 రా రైస్ మిల్లర్లు అన్‌లోడింగ్‌కు సిద్దంగా ఉండాలని, మాయిశ్చర్ వచ్చాకే టోకెన్లు ఇవ్వా లని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు ఎలాం టి ఇబ్బందులు రాకుండా ముందే లారీలను కేటాయించాల ని, రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో లా రీల కోసం ఎలాంటి డబ్బులు వసూలు చేయొద్దని, ధాన్యం కొనుగోలు అనంతరం రైతులకు తగిన రసీదులు ఇవ్వాలని చెప్పారు. ధాన్యాన్ని వెంట వెంటనే గోదాంలక తరలించాన్నా రు. సిఒలు, మండల ప్రత్యేక అధికారులు, క్లస్టర్స్, ప్రతి కేంద్రాన్ని ప్రతి రోజు సందర్శించి టోకెన్ ఇచ్చే ముందు క్రాఫ్ డాటా సర్వే నంబర్లను సరి చూసుకోవాలన్నారు. గత ఏడాది కొన్ని చోట్ల కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, ఈ సారి అలాంటి సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు, రవాణా చే సేందుకు, కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై ఎలాంటి ఫిర్యాదులైనా కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసే ఫోన్ నం. 6303928718లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఒలు మధుమోహన్, కృష్ణవేణి, డిఆర్డిఎ పిడి. రాంరెడ్డి,డిసిఒ కిరన్‌కుమార్,డిసిఎస్ రోజారాణి, డిఎం సివిల్ ప్లై సంధారాణి, మార్కెటింగ్ డిఎం నాగేశ్వర శర్మ, డిఎఒ వినోద్‌కుమార్, రవాణా అధికారి శ్రీనివాస్ రావు, ఎఫ్ సిఐ అధికారి ప్రకార్ వర్మ, డివిజనల్ మేనేజర్ శిశ కుమార్, అధికారులు, తహశీల్దార్లు, డిపిఎంలు, ప్రత్యేక అధికారులు, క్లస్టర్ సిబ్బంది, రైస్ మిల్లర్లు పెద్ది వెంకట నారాయణ గౌడ్, బెల్దె వెంకన్న, జయహరి, ప్యాడీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.