Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ఐక్య కార్మికోద్యమాలతో పాటు సామాజిక సమస్యలపై ఏకకాలంలో నిర్వహించే జమిలి పోరాటాలే కార్మికోద్యమ అగ్రనేత బిటి రణదివేకి అర్పించే నిజమైన నివాళియని సీఐ టీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ అన్నారు. గురు వారం జిల్లా కేంద్రంలో జీకే కోల్డ్ స్టోరేజ్ ఆవరణలో బిటి రణదీవే 33వవర్ధంతిసభ సీఐటీయూ పట్టణ కన్వీనర్ కుమ్మ రికుంట్ల నాగన్న అధ్యక్షతన జరిగింది. మొదటగా బిటిఆర్ చిత్రపటం వద్ద విప్లవ జోహార్లు అర్పించారు.అనంతరం సభ లో ఉపేందర్ పాల్గొని ప్రసంగిస్తూ 1984వ సంవత్సరంలో బొంబాయిలో జన్మించిన బీటీ రణదీవే 1990 ఏప్రిల్ 6న తుది శ్వాస విడిచారని, తన 86 సంవత్సరాల జీవితంలో స్వాతంత్ర పోరాటంతో పాటు అనేక కార్మిక, ప్రజా ఉద్యమా లకు నాయకత్వం వహించిన మహా నాయకుడని కొనియా డారు. బ్రిటిష్ కాలంలోనే బొంబాయిలో అనేక కార్మిక సం ఘాలను స్థాపించి కార్మిక పోరాటాలు నిర్వహించిన యో ధుడని తెలిపారు. 1970లో ఏర్పడిన సిఐటియుకు మొదటి అధ్యక్షుడిగా బిటి రణదీవే పని చేశారని తెలిపారు. అనుని త్యం కార్మికవర్గ ఐక్యతకు పరితపించేవారని, శ్రామిక మహి ళల సమస్యలను గుర్తించి సమన్యయ కమిటీ ఏర్పాటు చేయ టంలో ప్రధాన పాత్ర పోషించారని వివరించారు. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం నేడు కార్మికుల్ని కట్టు బానిసలుగా మారుస్తూ, కార్మిక హక్కులను కాలురాస్తూ, కులం, మతం పేరుతో కార్మికులను విభజిస్తున్న తరుణంలో బిటిఆర్ చూ పిన బాటలో నేడు ఐక్య కార్మిక పోరాటాలు నిర్వహించడంతో పాటు సామాజిక సమస్యలపై పోరాటాలు నిర్వహించాల్సిన బాధ్యత కార్మికవర్గానికి ఉందన్నారు. ఇందులో భాగంగానే బిటిఆర్ వర్ధంతి నుండి అంబేద్కర్ జయంతి వరకు సామా జిక న్యాయం కోసం సిఐటియు ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బిటిఆర్ ఆశయాల సాధ నకై సమరశీల పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈ సభలో సీఐటీయూ నాయకులు జనా ర్ధన్, గుట్టయ్య, వెంకన్న, శ్రీను, మహేష్, లక్ష్మణ్, లాలు కాంతి తదితరులు పాల్గొన్నారు
కార్మిక వర్గానికి దిక్సూచి బీటీఆర్ : చిట్యాల సోమన్న
పాలకుర్తి : కార్మిక వర్గానికి చట్టాలు హక్కులు సాధిం చిన మహనీయుడు బిటిఆర్ కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచాడని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న అన్నారు.కార్మికోద్యమనేత బీటీ రణదివే 33వ వర్ధం తిని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలో గల బిటిఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ భార తదేశ కార్మిక ఉద్యమంలో బిటి రణదివే కీలకపాత్ర పోషించా రని, భారతదేశ కార్మిక వర్గానికి చట్టాలు హక్కులు సాధించి న మహనీయుడని కొనియాడారు. భారత పెట్టుబడిదారీ వ ర్గం కార్మిక వర్గాన్ని శ్రమదోపిడి చేస్తుందని, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గ విముక్తి కోసం కార్మికులు సంఘటి తంగా పోరాడి తమ హక్కులు కాపాడుకోవాలని పిలుపుని చ్చారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం స్వదేశీ విదేశీ, బడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా సవరణలు చేస్తుందని విమర్శించారు. దీని ఫలితంగా కార్మికులు మరింత బానిసత్వంలోకి నెట్టివేయబ డుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది గంటల పని 12 గంటలకు పెంచుతూ కార్మికుల పై మరింత అదనపు పని భారం మోపుతున్నారని, కనీస వేతనాలు అమలు చేయడం లేదని విమర్శించారు. కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. సిఐటియు ఆధ్వ ర్యంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలతో పా టు సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా కార్మిక వర్గ సా మాజిక సమస్యలపై బిటి ఆర్ స్ఫూర్తితో ఉద్యమాలు చేపడ తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అంబటి సోమయ్య, షేర్ సమ్మయ్య, చిక్కుడు పరమేష్, ఎండి గుంశ, నాగన్న, బి రమేష్, ఎల్లయ్య, కుమార్, మైబు, ఏ వెంకన్న, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమానికి ఆదర్శమే కామ్రేడ్ బీటీఆర్ : సైదులు
నెల్లికుదురు : భారత కార్మికులకు ఉద్యమానికి ఊపిరి పోసిన కామ్రేడ్ బిటి రానదేవ్ ఆదర్శంగా నిలిచాడని సిఐ టియు మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు గురువారం అన్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమా నికి అనేక కృషి చేసిన గొప్ప కార్మికు ఉద్యమం మేధావి అయి నా కామ్రేడ్ బిటిఆర్ దోపిడీ అణచివేతకు వ్యతిరేకంగా కా ర్మికుల పని దినాల తగ్గింపు కోసం కార్మిక వర్గ సమస్యల పరి ష్కారానికి ఎనలేని కషిచేసిన మహా కార్మిక యోధులు కామ్రే డ్ బిటి రణదీవే అని తెలిపారు. ఆయన ఆశయాలను సాధిం చడానికి కార్మికులు కార్మిక వర్గ పోరాటాలలో ముందు ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, వెంక న్న, ఐలయ్య, పరమేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.