Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
మారుమూల గిరిజన ప్రాంతాలలో మంజూరైన అభివద్ధి పనులు వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలె క్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ కొత్తగూడ మండలంలో పర్యటించి రైతు వేది కలో కొత్తగూడ,గంగారం రెండు మండలాల అభివృ ద్ధి పనులను ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ సీతక్క అధ్యక్షతన ఏటూరు నాగారం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి రవి కిర ణ్లతో కలిసి సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికా రులతో రోడ్ల అభివద్ధి, త్రాగునీరు, కంటి వెలుగు ఆ రోగ్య మహిళ వంటి పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీలో ప్ర ధాన సమస్య రహదారులని నిర్ణీత సమయంలో పూ ర్తి చేయగలిగితే ఎటువంటి సమస్యలు ఉండవన్నా రు. పనులలో జాప్యం ఏర్పడితే సమస్యలు ఉత్పన్న మవుతాయన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా త్రాగునీరు అందిస్తున్నామని వేసవికాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించా రు. కంటి వెలుగు కార్యక్రమంలో100 మందికి తక్కు వ కాకుండా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. విస్తృ త ప్రచారం చేపట్టి ప్రతి ఒక్కరికే పరీక్షలు నిర్వ హించాలన్నారు. ప్రతి పిహెచ్సిలో వారానికి రెండు రోజులు కేటాయించి ఆయా తేదీలలో కంటి పరీక్షలు చేస్తున్నట్లు ముందస్తుగా ప్రజలకు తెలియజేయాల న్నారు.ఆరోగ్య మహిళ కార్యక్రమం క్రింద మహిళలైన ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా ప్రభు త్వం సూచించిన ఎనిమిది రకాల పరీక్షలు చేయించు కోవాలన్నారు. దూర ప్రాంతాల వారికి ఆర్భిఎస్కే వాహనాలు కానీ102 వాహనంకానీ ఏర్పాటు చేయా లని వైద్యాధికారులను ఆదేశించారు. సబ్ సెంటర్ల పు రోగతిని సమీక్షిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ త్వ రితగతిన పూర్తి చేయాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులు ఏప్రిల్ నెలాఖరు లోగా పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులు వినియోగించుకుని అధిక సంఖ్యలో కూలీలు పా ల్గొనేందుకు అధికారులు కూలీలను ప్రోత్సహించాల న్నారు. కూలీలు ఎంతమంది పాల్గొంటే అంతగా ని ధులు సీసీ రోడ్లకు మంజూరు అవుతాయన్నారు.ఈ సమీక్షలో ఆర్డిఓ కొమరయ్య,ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీ రింగ్ అధికారి హేమలత, రోడ్లు భవనాల ఇంజనీ రింగ్ అధికారి తానేశ్వర్, డిఆర్టిఏ పీడి సన్యాసయ్య, ఉప వైద్యాధికారి అంబరీష మిషన్ భగీరథ అధికారు లు, సురేందర్, కృష్ణారెడ్డి, కొత్తగూడ గంగారం తహ సిల్దార్లు చందా నరేష్, పద్మావతి, ఎంపీడీవోలు భారతి, వెంకటేశ్వర్లు, కొత్తగూడ గంగారం మండ లాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.