Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక అధికారులతో పర్యవేక్షణ, తనిఖీలు : కలెక్టర్
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటు న్నామని, ప్రత్యేక అధికారులతో పర్యవేక్షణ చేయిస్తూ తనిఖీలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివ లింగయ్య తెలిపారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపధ్యంలో ఆయన గురువారం జన గామ, నిడిగొండ, నెల్లుట్ల ఉన్నత పాఠశాలల్లో ఏ ర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీ క్షల సరళిని పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్ర భుత్వ సూచనల మేరకు ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరుగకుండా, మాస్ కాపియింగ్ జరుగ కుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప రీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్ష్న్ అమలులో ఉం టుందని, పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉం టాయని, పోలీస్ సిబ్బంది నిరంతరం భద్రత కల్పి స్తున్నామరి, పరీక్షల విధుల్లో పాల్గొనే సిబ్బందిని అప్ర మత్తత చేస్తున్నామని, ఇతరులను ఎవరిని పరీక్ష కేం ద్రంలోని అనుమతించేది లేదన్నారు. ప్రతి రోజు టెలి కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామ ని, జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకంగా పరీక్షల నిర్వహణ కోసం నియమించామని, జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. అద నపు కలెక్టర్ ప్రఫుల్ దేశారు కామారెడ్డిగూడెం ఉన్న త పాఠశాలలోని పరీక్షా కేంద్రంలో పరీక్షల తీరును పరిశీలించారు. ఈ తనిఖీల్లో జిల్లా విద్యాశాఖ అధికా రి రాము తదితరులున్నారు.
99.88 శాతం హాజరు : డీఈవో
గురువారం జరిగిన పరీక్షకు జిల్లావ్యాప్తంగా 42 పరీక్షా కేంద్రాల్లో 99.88 శాతం మంది విద్యార్ధులకు హాజరైనట్లు డిఇఒ రాము ఒక ప్రకటనలో తెలిపారు. 6,731 మంది విద్యార్ధుల్లో 8 మంది గైర్హాజరైనట్లు, 6,723 మంది పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల ఆకస్మిక తనిఖీలు
లింగాలఘనపురం :పదవ తరగతి పరీక్షల నిర్వ హణ కోసం పకడ్బందీగా ప్రత్యేక అధికారుల ద్వారా పర్యవేక్షణ,తనిఖీలు,ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, రఘునాథపల్లి మండలం నిడిగొండ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా ల, లింగాల గణపురం మండలం నెల్లుట్ల జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల సరళిని పరిశీలించి తగిన సూచనలు ఇచ్చా రు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశారు దేవరుప్పుల మండలంలోని కామారెడ్డి గూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పరీక్షలు పరిశీలించారు. స్టేట్ అబ్జర్వర్ విజయలక్ష్మి భారు టీఎస్ ఎంఎస్, జడ్పిహెచ్ఎస్ ఆశ్రమ పాఠశాల, నర్మెట్ట, జడ్పీహెచ్ ఎస్ తరిగొప్పుల పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల సరళిని ఆమె పరిశీలించారు, జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పదవ తరగతి పరీ క్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపా రు. ఈ తనిఖీల్లో జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము, సంబంధిత సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.
చిన్నగూడూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మూడవరోజు ఇంగ్లీష్ పరీక్ష ప్రశాం తంగా జరిగిందన్నారు. 156 మంది విద్యార్థులకు అందరూ హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులు పరీ క్ష కేంద్రానికి సమయం ముందే వచ్చి ఉండాలన్నారు. పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులు చూడాలని అధికారులను కోరారు.