Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుగ్గొండి
ఆడిట్ చేయడానికి విచ్చేసిన అధికా రులు రాజకీయాలకు అతీతంగా, నిస్వా ర్ధంగా ఆడిట్జరిపి ఐకెపిసంఘాల మహి ళలకు న్యాయం చేయాలని ఆడిట్ కమిటీ అధ్యక్షురాలు కనుకుల ధర్మావతి ఆడిట్ అధికారులను కోరారు. మండలంలోని మందపల్లి గ్రామ మహిళాసంఘంలో కొందరు బాధ్యతారహిత్యంగా వ్యవహరించి నందు వల్ల స్త్రీ నిధులు దుర్వినియోగం జరిగాయని స్ఫూర్తి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు పెండ్యాల రమ ఆరోపించారు. గురువారం ఎట్టకేలకు ఆడిట్ ప్రారంభం కావడంతో నిధుల దుర్వినియోగాన్ని తేట తెల్లం చేయాలని గ్రామైక్య సంఘం నిజనిర్ధారణ కమిటీ, ఆడిట్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతిమండల సమైక్య అధ్యక్షురాలు లలిత, సీసీ ఏలియా, శ్రీనిధి కోఆర్డినే టర్ క్రాంతి, ఆడిట్ కమిటీ సభ్యులు మేదరి పద్మ, ఆడిటర్లు శివ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.