Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్
నవతెలంగాణ - ములుగు
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో రాష్ట్ర ప్రజలకు తెలపాలని జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ కోరిక గోవింద్ నాయక్ డిమాం డ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ విభజన చట్టం లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు రాకుండా అడ్డుకుంటు రాష్ట్రంలో అలజడులు జరుపుతూ విద్యార్థులు, రాష్ట్ర ప్రజల జీవితాలతో బిజేపి ప్రభుత్వం, నాయకులు చెలగాటం ఆడుతున్నారని అన్నారు. రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తూ ప్రైవేటికరణ చేసేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మెస్తు దేశ సంపదను దోచుకుంటున్నారన్నారు. నేడు రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ను ఎందుకు ఎర్పాటు చేయలేదో ప్రజలకు సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం స్వయంగా బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజరు 10 వ తరగతి పేపర్ లీకేజీ లో అడ్డంగా దొరికిపోయి ఇంకా విద్యార్థుల మీద కపట ప్రేమ చూపిస్తూ రాష్ట్రంలో అలజడులు చేయాలనే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, ఇంచర్ల పిఎసిఎస్ చైర్మన్ చిక్కుల రాములు,సర్పంచ్ దాసరి రమేష్, జిల్లా బిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాసమల్ల సురేందర్, సీనియర్ నాయకులు గండ్ర కోట సుధీర్, గరిగే రఘు, లియకత్ అలి,గ్రామ పార్టీ అధ్యక్షులు అమర్ సింగ్,వార్డ్ సభ్యులు బల్గురి నవీన్, కాసిం, గడ్డం భద్రయ్య,నగేష్,లింగా మూర్తి, మహిళా నాయకురాలు వసంత,పద్మ, సంధ్య, జ్యోతీ, నాజియ తదితరులు పాల్గొన్నారు.