Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
మండల కేంద్రంలోని ఇందిరానగర్ చెందిన ఎస్సీ రాగిశెట్టి మధు చేసిన ఎస్సీ ఎస్టీ ఫిర్యాదు మేరకు శుక్రవారం ఏసీపీ దేవేందర్ రెడ్డి, సీఐ నాగ బాబు, ఎస్ఐ నవీన్ కుమార్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏసీపీ దేవేందర్ రెడ్డి మాట్లా డుతూ ఇటీవల మండల కేంద్రం కు చెందిన శివ రాత్రి తిరుపతి, నరసిములు, కొంచెపు నరేష్ లు వ్యక్తిగత కక్షలతో గోపాల్ నగర్ నర్సరీ వద్ద అటకా యించి కులం పేరుతో దూషించడం తో పాటు మరో నలుగురు వ్యక్తులతో కలసి కర్రలతో దాడి చేశారని తెలిపారు. సంఘటన స్థలం వద్ద విచారణ జరపడంతో పాటు నెట్ వర్క్ లొకేషన్ లో సంఘ టన స్థలం వద్ద దాడి జరిగినప్పుడు అనుమా నితులను ఆరా తీశామన్నారు. త్వరలోనే జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరణ ప్రకారం దాడి వెనుక జరిగిన బాధ్యులపై చర్యలు తప్పవని వెల్లడించారు. ఈ విచారణలో ఇరువురి పెద్దమనుషులు, సంబంధిత బాధ్యులు పలువురు పాల్గొన్నారు.