Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య
నవతెలంగాణ- ములుగు
ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే ఆస్తిగా భావించి, ఆరోగ్యం పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలి పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరిం చుకొని అవగాహన ర్యాలీకి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ పరిశుభ్రత పాటించాల ని, ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రత ఉండేలా చూసు కోవాలని కోరారు. చిన్నారులకు టీకాలు తప్పకుం డా ఇప్పించాలని అన్నారు. ప్రజలతోపాటు గర్భి ణీలు ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలని అన్నారు. తద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని తెలి పారు. కుటుంబ నియంత్రణ దంపతులు పాటిం చాలని అన్నారు. ఇద్దరు పిల్లల తర్వాత సంతానం వద్దు అనుకున్న దంపతులు మగవారికి ఎన్ఎస్వి వ్యాసక్తమీ ఆపరేషన్, స్త్రీలకు టు బెక్టమి ఆపరేషన్ పాటించాలని తెలిపారు. బాల్యవివాహాలు చేయ కూడదని తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ రెండు వారాలకు పైబడి దగ్గు ఉన్న ప్రతి ఒక్కరూ తెమడ పరీక్ష చేయించు కోవాలని, క్షయ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స తీసుకోవాలని ప్రభుత్వం ద్వారా ఉచితంగా చికిత్స ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డెమో తిరుపతయ్య, సిహెచ్ఓ దుర్గారావు, సంపత్ రావు, రాయిని గూడెం వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.