Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని కాటాపూర్కు చెందిన ప్రమా దానికి గురై కాలుకు దెబ్బ తగిలన టిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పల్లెర్ల మహేశ్వర చారి ని ములుగు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, స్థానిక సర్పంచ్ గౌరమ్మ, పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం సందర్శించి కుటుంబాన్ని పరామ ర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, స్థానిక సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ, టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు బండారు చంద్రయ్య, ముండ్రాతి రాజశ్రీ, కోఆప్షన్ సభ్యులు దిలావర్ ఖాన్, నాయకులు రంగు సత్యనారాయణ, సయ్యద్ హుస్సేన్ మేడిశెట్టి మల్లయ్య దేశోజు కోటయ్య, గండు బిక్షపతి, ఆలేటి ఇంద్రారెడ్డి, బందెల తిరుపతి, యాలం విక్రమ్, కొంకతి సత్యం, అప్పాజీ రతన్ తదితరులు పాల్గొన్నారు.