Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కార్పోరేషన్ రాష్ట్ర చైర్మెన్ బండ శ్రీనివాస్
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్/ రఘునాధపల్లి/దేవరుప్పుల
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం, అభివృద్ది కోసం ఎనలేని కృషి చేస్తుందని, దళితుల ఆర్ధిక అభివృధ్దే ధ్యేయంగా పథకాలు అముల చేస్తుందని ఎస్సీ కార్పోరేషన్ రాష్ట్ర చైర్మెన్ బండ శ్రీనివాస్ అన్నారు. దళితబంధు సర్వే పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం జనగామ జిల్లాలో పర్య టించి పలువురు లబ్దిదారులను కలిసి పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. రఘునా థపల్లి మండలం కోమళ్ళలో, దేవరుప్పుల మండలం బంజర గ్రామంలో పర్యటించారు. దళిత బంధు ద్వారా లబ్దిపొందిన వారిని కలుసుకున్నారు. కోమళ్ళ గ్రామంలో లబ్దిదారులు ఏర్పాటు చేసుకున్న డైరీని స్వయంగా పరిశీలించారు. డైరీ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. బంజారా గ్రామానికి చెందిన సంగి నర్సయ్య దళిత బంధు పథకం ద్వారా క్లాత్ ఎంపోరియం షో రూంను ఏర్పాటు చేసుకొని ఉపాధిని పొందుతున్న విషయాన్ని తెలుసుకొని అక్కడకు వెళ్ళి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మెన్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. తెలంగాణ ము ఖ్యమంత్రి కేసిఆర్ దళితులను ఆర్ధికంగా ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. లబ్ధిదారులు నిబద్దతతో పని చేసి పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. తెలంగాణ పథకాలు దేశానికే గొప్ప ఆద ర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ సంద ర్భంగా లబ్దిదారులను చైర్మెన్ సన్మానించారు. ఈ కా ర్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ ఇ.డి. డాక్టర్ వెంకన్న, సాంఘీక సంక్షేమ అధికారి కోర్నెలియస్, సూపర్నెంట్ ఆంజనేయప్రజాద్, లబ్దిదారులు మధుసూదన్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.