Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకర్షణగా నిలిచిన పలు ఈవెంట్లు..
- వేడుకలకు హాజరైన యాంకర్ సుమ
- ఆకట్టుకున్న ప్రో షో
నవతెలంగాణ-కాజీపేట
జాతీయ సాంకేతిక విద్యాలయం నిట్ వరంగల్ నందు ప్రతి సంవత్సరం విద్యార్థులచే నిర్వహించబడే స్ప్రింగ్ స్ప్రే వేడుకలు 2023 గాను గురువారం ప్రారంభమయ్యా. మూడు రోజులపాటు జరిగే వేడుకలను 7, 8, 9తేదీల నిర్వహిస్తుండగా శుక్రవారం మొదటి రోజు నిర్వహించిన పలు ఈవెంట్లు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాదాపు 50కి పైగా ఈ నిర్వహించడంతో విద్యార్థులు ఆనం దోత్సాహాల మధ్య ఈవెంట్లలో పాల్గొన్నారు. నిట్ వరంగల్ విద్యార్థులే కాకుండా పలు ఇంజనీరింగ్ కళాశాల నుండి హాజరైన విద్యార్థులు వేడుకలలో భాగస్వాములయ్యారు. శుక్రవారం నిట్ ఆవరణలోని అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ నందు నిర్వహించిన కా ర్యక్రమానికి ప్రముఖ యాంకర్ సుమ కనకాల హాజ రయ్యారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుం దని ప్రతిభను వెలికి తీసి ఉన్నత స్థాయికి ఎదగాల న్నారు. ఆసక్తి కలిగిన విభాగాన్ని ఎంచుకొని లక్ష్య సాధన దిశగా వెళ్లాలన్నారు. తల్లిదండ్రుల ఆశయ సాధనాలకు అనుగుణంగా యువత ముందుకు వెళ్లా లన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి లక్ష్యసాధన దిశగా ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్వి రమణారావు, డిన్ స్టూడెంట్ వెల్ఫేర్ పులి రవికుమార్, ఫ్యాకల్టీ అడ్వైజర్ హిరాలాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రో షో డీజే నైట్
స్ప్రింగ్ స్ప్రే వేడుకలలో భాగంగా నిర్వహించిన ప్రోషో కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. డీజే నైట్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని నృత్యాలు చేశారు.
వరల్డ్ క్లాసు మైక్రో ఆర్ట్..
వరంగల్ కు చెందిన అజరు కుమార్ సూది పై తయారుచేసిన మైక్రో ఆర్ట్ ఎగ్జిబిషన్ విద్యార్థులు ఎంతగానో ఆకట్టుకుంది. అజరు కుమార్ వరల్డ్ క్లాసు మైక్రో ఆర్ట్ ఎగ్జిబిషన్ కలను తిలకించడానికి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. దాదాపు 20 రకాల మైక్రో ఆర్ట్ లను ఎగ్జిట్ లో పెట్టారు. 2019 బొంబాయిలో జరిగిన మైక్రో ఆర్ట్ ఎగ్జిబిషన్లో అజరు కుమార్ పాల్గొని రెండవ స్థానాన్ని కైవసం చేసుకుని 5000 డాలర్లు గెలుపొందారు.
ఇమేజెస్ స్టాటర్స్
నిట్ వరంగల్ బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థులు మణిదీప్ శ్రావణిలు ఇమేజ్ స్టార్టర్స్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో పాల్గొన్న విద్యార్థులు ఇచ్చిన ఫోటో ఆధారంగా సమయంలో కొత్త కథను చెప్పే పద్ధతి విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంది. ఫోటో ఆధారంగా కథను చెప్పిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేయనున్నారు.
కరోకే సింగింగ్..
ఫైనల్ ఇయర్ విద్యార్థులు షబ్నూర్, సాత్విక్ కి పాటల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించగా పోటీలలో పాల్గొనడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. నచ్చిన పాటని బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా పాట పాడి వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఈవెంట్ అందర్నీ ఆకర్షించింది. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయనున్నారు.