Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ అంటే కేడీ... బీజేపీ అంటే ఫేక్ ముచ్చట్లు
- శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్
నవతెలంగాణ-ఎన్జీవోస్కాలనీ
గులాబీ జెండా రెపరెపలాడితే అందరికీ గౌర వంగా ఉంటుందని కవి, రచయిత, శాసనమండలి స భ్యులు దేశపతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కళ్యాణి ఫంక్షన్హాల్లో జరిగిన 51, 52, 59 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డుతూ బీఆర్ఎస్ అంటే మన కుటుంబం అని ఆత్మీ య సమ్మేళనంలో అందరంమనస్ఫూర్తిగా ఉన్నది ఉ న్నట్లు మాట్లాడుకుందామన్నారు. రాబోయేది బీఆర్ ఎస్ ప్రభుత్వమే అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కా ర్యకర్తలే బలం,బలగం అన్నారు. మోదీ ప్రతిపక్షాలపై అక్రమకేసులు పెట్టి ఈడీ, సీబీఐలతో దాడులు చేయి స్తున్నాడని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు పేపర్ లీక్ వీరులు అని ఎద్దేవా చేశారు. పద్దెనిమిది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక సార్లు పరీక్ష పేపర్లు లీకైన సంఘటనలు మనం చూస్తున్నామని అన్నారు. సాక్షా త్తు ప్రధానమంత్రి మోదీ రాష్ట్రం గుజరాత్ లో ఇప్పటి కి పదిసార్లు పేపర్లు లీకైన ఘటనలున్నాయని వివ రించారు. మోదీ అంటేకేడీ బీజేపీ అంటే ఫేక్ ముచ్చ ట్లని ఘాటూగా విమర్శించారు. ప్రతిపక్షాలకు వచ్చేవి ఈడీ సమన్లు కాదు మోదీ సమన్లు అని తెలిపారు. ప్రతిపక్ష నాయకులపై ఎ న్ని అక్రమ కేసులెట్టిన బీజే పీని పాతాళంలోకి పోయే లా బొందపెట్టేది బీఆర్ ఎస్యేనని బీఆర్ఎస్ పా ర్టీ నేతలు, కార్యకర్తలేనని తెలిపారు. కాంగ్రెస్‌కు క్యా డర్ లేదని, బీజేపీకి లీడర్లేరని, టీడీపీకి అసలు ఇక్క డ స్థానమే లేదన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ గెలిచే ది బీఆర్ఎస్ అని ఘంటాపథంగా తెలిపారు. తెలం గాణకు శ్రీరామరక్ష కేసీఆర్ నాయకత్వమే అని అన్నా రు. ఢిల్లీలోని బీజేపోళ్లకు సోయిలేదు గల్లీలో ఉన్న బీ జేపోళ్లకు తెలివిలేదని విమర్శించారు. బండి సంజయ్ ఏమి మాట్లాడతాడో ఆయనకే తెల్వదని, ఆయన్ని సీరీయస్‌గా తీస్కోవద్దని ఆ పార్టీ నేత ఎంపీ అరవిం ద్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. బీజే పోళ్ల మధ్యనే క్లారిటీలేదు వీళ్లు ప్రజలకు ఏమి చేస్తా రు వీళ్లు తెలం గాణను ఏం ఉద్ధరిస్తారని విమర్శించారు.
బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజ ల్లోకి బీఆర్ఎస్ శ్రేణులు తీసుకెళ్లాలని సూచించారు. పార్టీకోసం నిజాయితీగా పనిచేస్తే పదవులు వాటంత ట అవేవస్తాయని తెలిపారు. పార్టీ అంటే తల్లిలాంటి దని, తల్లిని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా పేర్కొన్నారు. పార్టీ బాగుంటేనే మనం బాగుంటా మని, పార్టీ అధికారంలో ఉంటే అందరికి పదవులు వస్తాయన్నారు.
ప్రభుత్వ చీఫ్‌విప్ పశ్చిమ శాసనసభ్యులు బి ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు గుండె మీ ద చేయివేసి ఒకసారి ఆలోచించాలి అని నాడు తెలం గాణ ఎట్లుండే, నేడు తెలంగాణ ఎట్లుంది, ఒకవైపు సంక్షేమం-మరోవైపుఅభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగా ణలో అమలు చేస్తున్నారని మాట్లాడుతూ మొదట సీఎం కేసీఆర్ సందేశాన్ని కార్యకర్తలకు చదివి వినిపించా రు. అనంతరం మాట్లాడుతూఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్ద 125అడుగులఅంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆరోజున జిల్లా వ్యా ప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.
ఏప్రిల్ 25వరకు డివిజన్‌స్థాయిలో వివిధ కమి టీలు ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ప్రణా ళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 30న డాక్టర్ బీఆర్.అంబేద్కర్ నూతన సచివా ల యం ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామాల్లో పల్లె ల్లో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని అన్నారు. మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకో వాలని సూచించారు. అదే విధంగా కార్మిక సంఘాల ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. జూన్ 2న రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా నిర్వహించుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, మర్రి యాదవ రెడ్డి, తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షు లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.