Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.అశోక్
నవతెలంగాణ-మట్టెవాడ
టిఎస్పిఎస్సి రాత పరీక్షతోపాటు పదవ తరగతి పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఎంసీపీఐయూ జా తీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకా ర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అండర్ బ్రిడ్జి వద్ద నున్న ఓంకార్ భవన్లో ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అ ధ్యక్షులు పల్లెమురళి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అఖి ల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొ న్న ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకా ల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ దగాపడ్డ తెలంగాణ గా అయిందని నిరుద్యోగుల ఆశలతో ప్రభుత్వం ఆట లాడుకుంటుందన్నారు. 2014 నుంచి ప్రతి నోటిఫికే షన్లో నిరుద్యోగులు పరీక్షలకు రిపేరు అవుతూనే వ స్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క శాఖలో కూడా నిరు ద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని మం డిపడ్డారు. 2018 వరకు పోలీస్ శాఖలో 29, వేలు ఇతరశాఖలో 36 వేల ఉ ద్యోగాలతో పాటు ఇటీవల ప్రకటించిన 67 వేల ఉ ద్యోగాలతో మొత్తం 94 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా మంటూ ప్రగల్బాలు పలికి అనేక శాఖలకు నోటిఫికేష న్లు ఇస్తూ ప్రిపేర్అయిన నిరుద్యోగులను నిరుత్సాహ పరిచేల పథకం ప్రకారం టిఎస్పిఎస్లో పరీక్ష పత్రా న్ని లీకేజీ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడు కుంటున్నారని ఆరోపించారు. 30 లక్షల మంది నిరు ద్యోగులు పేపర్ లీకేజీల కారణంగా నష్టపోయారని దీనికి పూర్తిబాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు. ఈనెల3న జరిగిన పదవతరగతి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమై న మొదటి రోజే తాండూర్లో తెలుగు పేపర్ లీకేజీ కావడం రెండవరోజు వరంగల్లో హిందీపేపర్ లీకేజీ కావడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ఇది కావాలనే ప్రభుత్వం, ఉద్యోగులు చేస్తున్న కుట్రగా కనిపిస్తుందన్నారు.
రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతోపాటు నిరు ద్యోగుల జీవితాలను నాశనం చేయడం కోసమే ఇ లాంటి దారుణాలకు పాటుపడుతున్నట్టు కనిపిస్తుం దని అన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చి పుస్తకాలలో మత గ్రంథాలను చేర్చి మతాన్నిపెంచి పోషించాలని చూ స్తున్నదని అందుకే జాతీయ విద్యా విధానాన్ని ఉప సంహరించుకోవడానికి ఉద్యమించాలనిపిలుపుని చ్చారు.పెండింగ్లోఉన్నఫీజురీయింబర్స్మెంట్ రూ. 4వేలకోట్లు తక్షణమే విడుదల చేయాలని విద్య, వైద్యం,ఉపాధి రంగాలను నిర్వీర్యం చేసి ప్రజల జీవి తాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకు ంటుందని ఆవేదన చెందారూ. చిత్తశుద్ధిఉంటే విద్యా రంగాన్ని బలోపే తంచేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి లీకేజీల బాధ్యులను సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి శిక్షించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు పెద్దారపు రమేష్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, రాష్ట్ర కోశాధికారి పోతుగంటి కాశి రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, ఏఐసిటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి బండారి చిరంజీవి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బండారి చిరంజీవి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నర్ర ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు జన్ను రమేష్, భాను, పిట్టల సాయికుమార్, గడ్డం రాజు, ఏఐసిటియు జిల్లా కార్యదర్శి సుంచు జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.