Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ విజన్ కారణమని పరకా ల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం గీసు గొండ మండలం ఊకల్ గ్రామశివారులోని ఎంఎస్ ఆర్ గార్డెన్స్‌లో సంగెం మండల సంగెం,తిమ్మాపూర్, ఎల్గుర్ రంగంపేట, నర్సనగర్, బిక్కోజునాయక్ తం డా, ఏల్గుర్ స్టేషన్, గాంధీనగర్, కొత్తగూడెం, సొమ్లా తండా, తీగరాజుపల్లి గ్రామాల నాయకులతో బీఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా పథకాలను అమ లు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షే మ, అభివృద్ధి పథకాలతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం రె ట్టింపైందని పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్రామాల్లో చర్చ జరపాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూ చించారు. బడుగు, బలహీ న వర్గాల అభ్యున్నతే బీఆర్ ఎస్ ఎజెండా అని అన్నా రు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షా లు రాద్ధాంతం చేస్తున్నా యని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చై ర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు,మండల పార్టీ అధ్య క్షుడు పసునూరి సారంగపాణి, జెడ్పీటీసీ గూడ సుద ర్శన్‌రెడ్డి, ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ములుగు సాగర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, యువ నాయకుడు పు రుషోత్తం, ఆయాగ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు, పార్టీ అధ్యక్ష,కార్యదర్శులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.