Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వ రంగ సం స్థలైన రైల్వే, ఎల్ఐసి, సింగరేణిలను ప్రైవేటీకరి స్తూ ఆదాని,అంబానీలాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెడు తోందని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజక వర్గ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణరావు ధ్వజమెత్తా రు. మండలంలోని నూర్జహాన్‌పల్లి, కాట్రపల్లి, సాదో నిపల్లి,రాజుపల్లి,పత్తిపాక, హుస్సేన్‌పల్లి గ్రామాలలో శుక్రవారం హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మండ ల పార్టీ అధ్యక్షులు దూది పాల బుచ్చిరెడ్డి అధ్యక్షత న కొనసాగగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొ న్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగుర వేశారు. కేంద్ర,రాష్ట్ర ప్ర భుత్వాలు అవలం భిస్తు న్న ప్రజావ్యతి రేక విధా నాలను ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంచిపెట్టారు. అనంతరం రోడ్‌షోలో మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపిస్తే నిరుపేదలకు రూ.500 లకే వంటగ్యాస్సిలిండర్లు అందజేస్తామని, ఇండ్లు లేని నిరుపేదలకు సొంత ఇల్లు కట్టుకునేందు కు రూ.5లక్షలు ఇస్తామని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు, భూకబ్జా లు మితిమీరిపోతున్నాయనివిమర్శించారు. భూపా లపల్లి జిల్లాకేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పబ్లిక్కార్నర్ మీటిం గుకు అశేష ప్రజానీకం హా జరుకాగా, ఓర్వలేని అధికారపార్టీ కార్యకర్తలు టమా టాలు, కోడిగుడ్లు, బీరు సీసాలతో దాడిచేయించా రన్నారు. ఈ దాడిని నియోజకవర్గ ప్రజలు గమనిస్తు న్నారని, రాబోయే ఎన్నికలలో అక్రమ సంపాదన ఎంత ఖర్చుపెట్టినా ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికలుఎప్పుడు వచ్చినాభూపాల పల్లిలో కాంగ్రెస్జెండాఎగరవేయడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో గెలిపిస్తే జయశంకర్ భూపాలపల్లిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.ఈయాత్రలో భూపాలపల్లి అసెంబ్లీ కో-ఆర్డినే టర్ మార్క విజరుగౌడ్, నాయకులు మారపల్లి ర వీందర్, చిందంరవి, నిమ్మల రమేష్, దుబాసి కృష్ణ మూర్తి, ఎండి.వలిహైదర్, కట్టయ్య, నాగరాజు, వి ష్ణు, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.