Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
10వ తరగతి పరీక్షల్లో హన్మకొండ జిల్లా కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం నుండి హిందీ పేపర్ బయటకు వచ్చిన సంఘటనలో ఇన్విజిలేటర్ సబియా మహాదత్ను ఉద్యోగం నుండి తొలగిస్తూ అక్కడి డిఇఒ ఇచ్చిన ఉత్త ర్వులను వెంటనే నిలుపుదల చేయాలని, సమగ్ర విచారణ జరిపిన అనంతరమే చర్యలు తీసుకోవాలని టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 4న కమలాపూర్‌లోని జెడ్పీహెచ్ఎస్ రూం నంబరు 3 నుండి పేపర్ బయటకు వచ్చిన ఘటనలో బాధితురాలిని చేస్తూ ఇన్విజిలేటర్ నేరెళ్ళ యుపిఎస్ ఉపాధ్యాయిని సిబియా మహదత్ను విచారణ లేకుండా సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పేపర్ లీకేజీ ఘటనలో ఎవరి పాత్ర ఏమిటో లేల్చి నిందితులకు కఠినంగా శిక్షించాల్సి పోయి ఉపాధ్యాయులను భయబ్రాంతులను గురిచే యడం తగదన్నారు. సీసీఏ నిబంధనలు పాటించకుండా ఏక పక్షంగా ఉద్యోగం నుండి తొలగించడం సమంజసం కాదన్నారు. డీఈఓ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో పలువురు ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.