Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చే ధరఖాస్తులకు వెంటనే పరిష్కారం చేయా లని, లేని పక్షంలో బాధితులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్ట ర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమ వారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశా రుతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.తన భూమిని ఇతరులు అక్ర మంగా పట్టా చేయించుకొని పట్టాదారు పాసుపుస్తకాలు పొందారని, వెంటనే తన కు న్యాయం చేయాలని పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన దండె బోయిన కుమార్ ఫిర్యాదు చేశారు. 1995లో తాను కొనుగోలు చేసిన భూమిలో ఇప్పటి వరకు తానే కబ్జాలో ఉన్నానని, సదరు భూమిని ధరణిలో నమోదు చేసి రైతు బంధు పథకాన్ని వర్తింప చేయాలని లింగాలఘణపురం మండలం పటేల్ గూడెం గ్రామానికి చెందిన కడుదూరి వెంకటయ్య ధరఖాస్తు చేసుకున్నారు. పట్ట ణంలోని జిఎంఆర్ కాలనీలో 50 ఫీట్ల రోడ్డును ఆక్రమించుకొని గోడ నిర్మాణం చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని గోడనిర్మాణం పనులను ఆపించాలని కాలనీ వా సులు ఫిర్యాదు చేశారు. తన పేరిట ఉన్న 4 ఎకరాల భూమిని కొడుకు, కోడలు అక్రమంగా పట్టా చేయించుకున్నారని, వృధ్దాప్యంలో అనారోగ్యానికి గురి కాగా పట్టించుకోవడ లేదని, తన కొడుకు, కోడలుతో మాట్లాడి తనకు, తన భార్య వైద్యా నికి, పోషణకు డబ్బులు ఇప్పించాలని రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామా నికి చెందిన పి.వెంకట్‌రెడ్డి అధికారులకు విన్నవించుకున్నారు. నిరుపేద కుటుం బానికి చెందిన తనకు అంత్యోదయ రేషన్‌కార్డు ఇప్పించి ఆదుకోవాలని కోరుతూ లింగాలఘణపురం మండలం నాగారం గ్రామానికి చెందిన పిట్టల వెంకట వీర మల్లయ్య ప్రజావాణిలో ధరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ శాఖకు వచ్చిన 44 ధర ఖాస్తులతో కలుపుకొని మొత్తం 62 విజ్ఞప్తులు ప్రజావాణిలో వచ్చినట్లు, వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఒలు మధుమోహన్, కృష్ణవేణి, డిఆర్డిఎ పిడి రాంరెడ్డి, ఎన్పీ డిసిఎల్ ఎస్.సి. వేణుమాదవ్, జిల్లా వ్యవసాయాధికారి వినోద్‌కుమార్, డిపిఒ రంగాచారి, జెడ్పీసిఇఒ వసంత, మున్సిపల్ కమిషనర్ రజిత, ఆర్టీసి డిఎం జోత్స్న, సిపిఒ ఇస్మాయిల్, కలెక్టరేట్ పరిపాలనాధికారి మన్సూరి, ఎస్సీ కార్పోరేషన్ ఈ డి వెంకన్న, కోర్నెలియస్, బిసి కార్పోరేషన్ ఈ.డి. రవీందర్, డిడబ్ల్యుఒ జయంతి, ఉద్యానవన శాఖ అధికారి లత, జనగామ తహశీల్దార్ రవీందర్ పాల్గొన్నారు.