Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మండలంలో అత్యంత మారుమూల ఏజెన్సీ గ్రా మమైన దొరవారి తిమ్మాపురం ఏజెన్సీ గ్రామం నుం డి హత్ సే హాత్ జోడోయాత్ర సోమవారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు హాత్ సే హాత్ జొడో యాత్రలో భాగంగా మహబూ బాబాద్ నియోజకవర్గ గూడూరు మండలంలోని కాంగ్రెస్ మండల అధ్యక్షులు కత్తి స్వామి ఆధ్వర్యంలో గూడూరు మండలంలోని మట్టేవాడ శివారు దొర వారి తిమ్మాపురంలో ఆంజనేయుడిని దర్శించుకొని యాత్ర మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ పాల్గొ ని, ఇక్కడ నివసిస్తున్న ఆదివాసులు 24 కుటుంబాల సమస్యలను గడప గడపకు తిరుగుతూ వారి సమ స్యలు తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ వారు గత 150 సంవత్సరాల నుండి నివాసిస్తున్నా మని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాకు భూ ములు పట్టచేయించి, డ్యామ్, కరెంట్, మట్టి రోడ్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.కానీ ఇప్పటి కేసీఆర్ ప్రభుత్వం మా భూములను బలవంతంగా గుంజుకోవాలని,అధికారుల ద్వారా భయబ్రాంతులకు గురి చేసి,ప్రయత్నాలు చేసి ఒక నెల వరకు కరెంట్ ను కట్ చేసారని,అనేక సమస్యలను బలరాం నా యక్ ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు. అనంత రం బలరాం నాయక్ మాట్లాడుతూ దొరవారి తిమ్మా పురం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్కడ ఒక్కటే బోర్ ఉండడం వల్ల ఎండాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులు పడతారని, తక్ష ణమే వారికి ఇంకోటి బోర్ వేయించాలని, కాంగ్రెస్ పార్టీ దానికి పైసలు కడ్తామని గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదేశించారు. 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని,మీ సమస్య లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ యాత్రలో ఏఐసీసీ ఆదివాసీ వైస్ చైర్మన్ తేజవాత్ బెల్లయ్యనాయక్, జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నునవత్ రాధ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నునవత్ రమేష్ నాయక్, కిసాన్ సెల్ జిల్లా అధ్య క్షుడు తోట వెంకన్న, మహబూబాబాద్ మండల మ హిళ అధ్యక్షురాలు స్వర్ణలత, విజయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి,సొసైటీ వైస్ చైర్మన్ వేం శ్రీనివాస్ రెడ్డి, సిటీ యూత్ ప్రెసిడెంట్ మండల మ ల్లేష్, మేజర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు రస మల్ల యాకయ్య, తండాయాకాంబరం, ముత్యం రవి, ఎలికట్టే వెంకన్న,వాసం వీరస్వామి,దోమ సతీష్,సుర శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.