Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించాలని, దానిపై అన్ని గ్రామాల్లో మరింత కృషి జరగాలని ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య అన్నారు.సోమవారం డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో స్వచ్ఛభారత్ ఫేజ్-2లో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని,బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) రాష్ట్రాలలో ఔత్సాహిక అభివృద్ధి మోడల్‌గా తెలంగాణ ఉందని గుర్తు చేశారు. అన్ని గ్రామాల్లోప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డిని నిర్మించుకోవాలన్నారు.దీని కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తుం దన్నారు. బహిరంగ మల మూత్ర విసర్జన రహిత రాష్ట్రంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందన్నారు.ఇంకా ఎక్కడైనా బహిరంగ మలమూత్ర విసర్జన పరి స్థితులు ఉంటే, వెంటనే రూపుమాపాలన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. బహిరంగ మల మూత్ర విసర్జన నివారణ కోసం కృషి చేస్తున్న గ్రామ పంచాయతీ లకు పురస్కారాలు అందుతున్నాయని గుర్తు చేశారు.సీఎం కేసిఆర్ దిశా నిర్దేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాల వల్లనే మన పల్లెలు ఆదర్శంగా మారాయని అన్నారు.పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు ఇలా అనేక అభివృద్ది పనులు చేప డుతూనే నిరంతరం పారిశుధ్య పనులు చేయడం జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో ప్రశంసలు, అభినందనలు వస్తున్నాయని అన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం సీఎం కేసిఆర్ పటిష్ఠమైన నాయకత్వ పరిపాలనలో సాధిస్తున్న అద్భుత ప్రగతికి నిదర్శనమని అన్నారు.సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లెప్రగతి సత్ఫలితాలిస్తున్నద ని, ఉద్యమ తరహాలో పల్లెల రూపురేఖలను మార్చడంతో పరిశుభ్రంగా మారాయ న్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులకు అదనంగా రాష్ట్రం నిధులు కేటాయి స్తూ కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ప్రతి గ్రామానికి ట్యాంకర్,వ్యర్థాల తరలింపునకు ట్రాక్టర్, ట్రాలీ మంజూరు చేసింది. డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల నిర్మాణం, మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్, రైతు వేది కలు, సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతోపాటు మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నారన్నారు. హరితహారంతో రాష్ట్రమంతా పచ్చదనం పరిఢ విల్లుతున్నదన్నారు.ఈ సమావేశంలో ఎంపీడీవో సింగారపుకుమార్,ఎంపీఓ గౌస్, ఏపీవో పార్థసారథి, అంబుడ్స్‌మెన్ బి.ఆదాము, డీఆర్డీఏ ప్రతినిధులు పి.శ్రావణ్, సిహెచ్.రవికుమార్ సర్పంచ్‌లు,అంగన్వాడి టీచర్లు,ఆశా వర్కర్స్,పంచాయతీ కార్యదర్శిలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.