Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ మండలంలోని లక్ష్మా తండా పరిధిలో ఉన్న రేకుల తం డాకు తారు రోడ్డు ఏర్పాటు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి దుడ్డేల రా మ్మూర్తి డిమాండ్ చేశారు. సోమవారం మండల పార్టీ కార్యదర్శి దుడ్డెల రామ్మూ ర్తి బృందం రేకులతండా రోడ్డును పరి శీలించి స్థానిక సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మిషన్ భగీ రథ నీళ్ల ట్యాంకు నిర్మించినప్పటికీ ప్రా రంభించలేదని, ప్రజలకు ఉపయోగకరం గా లేదని అన్నారు. నీటిపైపు పగిలిపోయి రోడ్డు మీద బురద అవుతున్న గ్రామపం చాయతీ పాలకవర్గం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు అన్నారు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు వెలిశాల సుధాకర్, చేపూరి గణేష్, స్థానిక ప్రజలు గుగులోతు రవి గుగులోతు లచ్చు, బానోత్ శంకర్, జాటోత్ రమేష్, రంగ్య, వీరన్న, సురేష్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.