Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం మండల కార్యదర్శి పెరుమాళ్ళ తిలక్ బాబు
నవతెలంగాణ-నెల్లికుదురు
ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించేందుకు ఏర్పాటు చే యాలని సీపీఎం మండల కార్యదర్శి తిరుమల తిలక్బాబు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో నిరసన తెలిపి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి పత్రాన్ని తహసిల్దార్ యోగేశ్వరరావుకు సీపీ ఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మండల కేంద్రంలోని 31 సర్వే నెంబర్లు గత 20 సంవత్సరాల క్రితమే నిరుపేదల కోసం ఎర్రజెండాలను పాతి గుడిసెలు వేశామన్నారు. అట్టి భూమిని పేదలకు కేటాయించకుండా రెవెన్యూ అధికారులు ఆక్రమంగా పట్టా ఓ ప్రైవేటు వ్యక్తికి చేశారని ఆరోపించారు. ఆక్రమ పట్టా చేసిన దాన్ని రద్దుపరిచి అట్టి భూమి ని ప్రభుత్వమే స్వాధీన పరుచుకొని ఇల్లు లేని నిరుపేదలకు అవకాశం ఇవ్వాలని అన్నారు. అలాగే ఆక్రమంగా పట్టా చేసిన అధికారిని తక్షణమే సస్పెండ్ చేసి పేద లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మం డల కార్యదర్శి ఈసంపల్లి సైదులు, బొల్లం ఎల్లయ్య, యాకయ్య, పెరుమాళ్ళ పుల్ల య్య, ఉప్పలయ్య, కొమురయ్య, బిక్షపతి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.