Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల మార్క్ పాలన..
- వరంగల్ పోలిస్ కమిషనరేట్‌లో విచిత్ర పరిస్థితి
నవతెలంగాన-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ నగరంలో భూకబ్జాలకు సంబంధించిన ఫిర్యా దుల్లో అసలుదారులకు అన్యాయం జరుగుతుండగా, కబా ్జదారులకు పోలిస్ అధికారులు అండగా నిలిచి పోలీసు కమి షనర్‌ను పక్కదోవపట్టిస్తుండడం గమనార్హం. ఇంతేజార్గం జ్, ఎనుమాముల పోలిస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న భూదందాల్లో పోలిస్ అధికారులే ప్రత్యక్ష పాత్ర పోషిస్తుం డడం విమర్శలకు తావిస్తోంది. పోలిస్ కమిషనరేట్లోకి ప ట్టాదారులను తీసుకుపోవడం టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించి నాలుగు తగిలించడం పరిపాటిగా మారింది. ఇలా చేసినం దుకు ఇవే ఫిర్యాదుల్లో నిందితులుగా ఉన్న వారు బయట పోలిస్ కమిషనర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం చర్చనీ యాంశంగా మారింది. ఒక పోలిస్ అధికారి రూ.20 లక్షల ముడుపులు తీసుకొని పోలిస్ కమిషనర్‌ను పక్కదోవపట్టించి నట్లు ప్రచారం జరుగుతోంది. అసలుదారులను టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కొట్టించి కేసులు బనాయించి వారిని బయటకు రాకుండా పిడి యాక్ట్ పెట్టి లోపల్నే ఉంచే ప్రయత్నం చేస్తు న్నాడు. అసలుదారులు జైల్లో ఉండడంతో కబ్జాదారులను ప్రోత్సహించి ఎలాంటి అనుమతులు లేకున్నా వారితో ప్రహ రి కట్టిస్తుండడం గమనార్హం. మరో కేసులో రూ.20 లక్షలు తీసుకున్న పోలిస్ అధికారే దళిత లబ్దిదారులకు 121 గజాల పట్టా ఉన్నా వారిని పొజీషన్ మీదకు రానీయకుండా బెది రించి దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన వారికి వత్తాసు పలికి ఇండ్ల నిర్మాణానికి సహకరించడం గమనార్హం. ఈ అధికారి లీలలు తెలియక పోలిస్ కమిషనర్ సైతం ఇరుక్కుపోయే ప్రమాదం ఏర్పడింది.
వరంగల్ పోలిస్ కమిషనరేట్ పరిధిలో కొత్త పోలిస్ కమిషనర్‌గా వచ్చిన ఏవీ రంగనాధ్ హయాంలో భూక బ్జాలపై ఫోకస్ పెట్టినా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న విష యాలు ఆయన దృష్టికి రావడం లేదు. పలువురు పోలీసు అధికారులు భూకబ్జాదారులతో కుమ్మక్కై నాటకీయంగా వారి పనులను చక్కపెట్టుకుంటున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎనుమాముల, ఇంతేజార్గంజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో తాజాగా నమోదు చేసిన కేసులను పరిశీ లిస్తే ఈ కేసుల వెనుక మతలబు ఏమిటో ఇట్టే అర్ధమవు తుంది. తాతలు, తండ్రుల నుండి సంక్రమించిన భూముల కు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లున్న వారిని నమ్మించి పోలీసు కమిషనర్ సమక్షంలోకి తీసుకు వచ్చి టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించి చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగు తోంది. ఈ భూమికి సంబంధించి గతంలో వున్న సిఐ, స్పెషల్ బ్రాంచ్ అధికారులు నేరుగా వచ్చి డాక్యుమెం ట్లు పరిశీలించి విచారణ చేసిన అనంతరం ఈ వ్యవహారం లో జోక్యం చేసుకోలేదు. తాజాగా వచ్చిన సీిఐ భూకబ్జా దారుల కు అండగా వుండి చక్రం తిప్పారు. ఈ కేసులో భూకబ్జాదా రుడు తన కులానికి చెందిన వాడే కావడంతో ఇక ఆ పోలీసు అధికారి అసలుదారులపై కేసుల మీద కేసులు పెడుతూ ఆశ్రిత పక్షపాతాన్ని ప్రదర్శిస్తుండడం గమనార్హం. గతంలో ఈ అధికారిపై ఆరోపణలున్న విషయం విదితమే.
ఎనుమాములలో భూదందా..
ఎనుమాముల పోలిస్‌స్టేషన్ పరిధిలో భూ కబ్జాలకు సంబంధించి ఇటీవల రెండు ఫిర్యాదులు వచ్చాయి. అవి పోలీసు కమిషనర్ దృష్టికి వెళ్లగా ఒక ఫిర్యాదుపైనే పోలీసు కమిషనర్ స్పందించినట్లు సమాచారం. ఈ కేసులో కార్పొరేటర్ భర్తతోపాటు మరో నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీ సులు పట్టుకుపోయినా, కేవలం కార్పొరేటర్ భర్తపైనే కేసు పెట్టి మిగతా వారిని వదిలేసినట్లు విశ్వసనీయంగా తెలి సింది. ఈ వ్యవహారంలో సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం వల్లే వారిని వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరో ఫిర్యాదులోనూ కార్పొరేటర్ భర్తతో పాటు మరో 7గురిపై ఫిర్యాదు చేసినా వారిపై పోలీసు కమిషనర్ చర్య తీసుకోకపోవడం పట్ల బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిర్యాదులో కబ్జాదా రులుగా ఉన్న వారే కార్పొరేటర్ భర్తను అరెస్ట్ చేశాక పోలీసు కమిషనర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం విస్మయాన్ని కలిగి స్తుంది. పాలాభిషేకం చేసిన వారిలో పలువురిపై భూకబ్జా ఆరోపణలున్నాయి. వారి విషయంలో ఇప్పటికే పోలీసు కమిషనర్‌కు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. అలాంటి వారు పోలీసు కమిషనర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం దేనికి సంకేతం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా పలువురు పోలీసు ఇన్స్పెక్టర్ల వ్యవహారశైలి విమ ర్శలకు తావిస్తోంది. ఎనుమాముల, ఇంతేజార్గంజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో సివిల్ కేసుల్లో పోలీసు అధికారులు అతి జోక్యం చేసుకోవడమే కాకుండా పోలీసు కమిషనర్‌ను అప్ర తిష్టపాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పోలీసు శాఖలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అధికారులపై విచారణ చేయిస్తే నయా భూదందా బహిర్గతమవుతుందని బాధితులు చెబుతున్నారు.
పట్టాలున్నా సీఐ బెదిరింపులు
దళితులు అధికంగా నివాసముండే ఈ ప్రాంతంలో ప్రభుత్వం 121 గజాలు ఇస్తూ పట్టా సర్టిఫికెట్లు జారీ చేసి నా వారిని సైతం సిఐ వదల్లేదు.. బెదిరించి మరీ ఖాళీ చే యించడం గమనార్హం. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలనే చెల్ల వంటూ ఈ సిఐ సివిల్ కేసులను ఆయనే స్వయంగా పరిష్కరిస్తున్నాడు. పట్టాలున్న లబ్దిదారులను పొజీషన్లోకి రావద్దంటున్న దొంగ కాగితాలను సృష్టించిన కబ్జాదారులకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రోత్సహిస్తుండడంతో బాధితుల లబోదిబోమంటున్నారు. పోలిస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేద్దా మని యోచిస్తున్న తరుణంలో ఎస్సైతో పిలిపించి బెదిరిం చడంతో సదరు బాధితులు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లలేక పోతున్నారు. ప్రభుత్వమిచ్చిన పట్టాలే చెల్లవంటున్న ఈ సిఐ నయా భూదందాపై పోలీసు కమిషనర్ విచారణ చేయించ కపోతే కమిషనరేట్ మొత్తం ఇదే దందా నడుస్తుందని ప్రజలు భావించే అవకాశం లేకపోలేదు.