Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలంలో పతి ఎకరాకు నీళ్లు తెచ్చే భాధ్యత నాదే : ఎమ్మెల్సీ పల్లా
నవతెలంగాణ-వేలేరు
తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమని, కార్యకర్తలు, ప్రజలతో మమేక మయ్యేందుకే ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్య క్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమ వారం మండలంలోని షోడాషపల్లి ఎస్ఎస్ ఫంక్షన్ హల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి వారు పాల్గొ న్నారు. సమావేశం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే రాజయ్య సీఎం కేసీఆర్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... వేలేరు మండలంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే భాధ్యత నాదేనని అన్నారు. మండలంలో డబుల్ రోడ్డుతో పాటు సెం ట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయి స్తానని తెలిపారు. మండలంలోని ప్రతి దళిత కుటుం బానికి దళితబంధు అందించేaవ సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని తెలిపారు. రానున్న గహలక్ష్మీ పథ కంలో పేదలైన బీఆర్ఎస్ కార్యకర్తలకు ముందుగా ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నయాపైసా కూడా ఇవ్వలేదని ధ్వజ మెత్తారు. మొన్న హైదరాబాద్ లో సభలో నరేంద్ర మోదీ పచ్చి అబధ్ధాలు మాట్లాడాడని విమర్శించారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 60 లక్షలమందికి రేషన్ బియ్యం ఇస్తే తెలంగాణ ప్రభు త్వం 90 లక్షల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని అన్నారు. బీజేపీకి అభ్యర్థులు కరువని అన్నారు. ఘన్ పూర్ నియోజకవర్గంలో ఏ పనులైన చేయించే భాధ్య త తనదేనని, మిగిలిపోయిన పనులనింటిని పూర్తి చే యిస్తానని హమీ ఇచ్చారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూ త్న పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ గడప గడపకు అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరి స్తూ పార్టీ బలోపేతానికి కషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుం దని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో తెలంగాణ తరహా పథకాలేవని బీజేపీ నాయకులను ప్రశ్నిం చారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేయని అభివద్ధి తెలంగాణలో చేస్తామని బీజేపీ నాయకులు చెప్పడం హాస్యాస్ప దమని అన్నారు. బీజేపీ నాయకుల మాటలు తెలంగాణ ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనానికి బిజెపి , కాంగ్రెస్ కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర అభివద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, ఎంపీపీ సమ్మిరెడ్డి , జడ్పీటీసీ చాడ సరిత విజేందర్ రెడ్డి, జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, చిల్పూర్ గుట్ట దేవాలయ చైర్మన్ శ్రీధర్‌రావు, జిల్లా ఆత్మ చైర్మన్ కీర్తి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు మరిజె నర్సింగ రావు, వైస్ ఎంపీపీ ఆంగోతు సంపత్, మండల సమ న్వయకర్తలు బిల్లా యాదగిరి, మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, గ్రామశాఖల అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.