Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
నూతనంగా నిర్మించిన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు జిల్లాల నుంచి ప్రజలు సకాలంలో చేరే విధంగా పకడ్బందీ కార్యాచరణ రూపోందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ఏప్రిల్ 14న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కు జిల్లా నుంచి ప్రజల తరలింపు కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వ హించారు. 125 అడుగులతో ఎత్తయిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ పండుగ వాతావరణంలో నిర్వహిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది ప్రజలను తరలించే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 8 బస్సులో 400 మంది ప్రజలను తరలించే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ మండల హెడ్ క్వార్టర్ నుంచి బస్సుల ద్వారా ప్రజల ను తరలించాలని తెలిపారు. భూపాలపల్లి నియోజ కవర్గంలో 5 బస్సులు ద్వారా, మంథని నియోజక వర్గం లోని 3 బస్సుల ద్వారా మొత్తం 400 మంది ప్రజలు తరలించాలని తెలిపారు. మండల కేంద్రా ల్లో ఉదయం ప్రజలు వచ్చే విధంగా ముందస్తు సమాచారం అందించాలని, సకాలంలో హైదరాబాద్ కు' చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని, ప్రతి బస్సులో అవసరమైన మేర మంచినీటి బాటిల్లు, ఓఆర్ఎస్, బిస్కెట్, స్నాక్స్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని, వారికి టిఫిన్ లంచ్ డిన్నర్ ఏర్పాట్లు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, రూట్ మ్యాపింగ్ పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, బస్సులు సకాలంలో వచ్చేలా చూడాలని తెలిపారు. జిల్లాలో భూపాలపల్లి నుంచి ఉదయం 6.30 గంటలకు, మిగిలిన మండలాల నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరే విధంగా ప్రణాళిక చేసుకోవా లని ఆదేశించారు. అదనపు కలెక్టర్ టీిఎస్ దివాకర, డీఆర్డీఓ పురుషోత్తం, జెడ్పీ సీఈఓ రఘువరన్, డీపీఓ ఆశలత, కలెక్టరేట్ ఏవో మహేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి సునిత, తదితరులు పాల్గొన్నారు.