Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
భూపాలపల్లి ఏరియాలోని ఆయా గనుల సంక్షేమ అధికారులతో, ఆఫీస్ సూపరింటెండెంట్ లతో, పిట్ ఆఫీస్ అసిస్టెంట్లతో వివిధ కార్మిక సంక్షేమ కార్యక్రమాలపై సోమవారం జిఎం కార్యాల యంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏరియా డిజిఎం (పర్సనల్) అజ్మీర తుకారం సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన టైం రేటెడ్ ప్రమోషన్లు, టెర్మినల్ బెనిఫిట్స్, కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసే ప్రక్రియ, రామప్ప కాలనీలో నూతనంగా నిర్మించిన 994 క్వార్టర్లను కార్మికులకు కేటాయించే విషయం పై సుదీర్ఘ చర్చ నిర్వహించారు. వివిధ గనులలో మిగిలి ఉన్న ప్రమోషన్లను గుర్తించి అరువైన వారం దరికీ త్వర త్వరగా ప్రమోషన్లను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రామప్ప కాలనీలో క్వార్టర్లకు అర్హులైన ఉద్యోగులు దరఖాస్తు చేసుకునేలా గనుల ఆఫీస్ సూపరిం టెండెంట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ శివ కేశవరావు , సీనియర్ పీఓ క్రాంతికుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.