Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నియోజక వర్గానికి 2000 ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయిం చిందని, గ్రామసభల మాత్రమే అర్హులను ఎంపిక చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది పేదలు గ్రామాలలో ఇండ్ల స్థలాలు లేక ఇండ్లు నిర్మిం చుకోలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం గృహ నిర్మాణానికి 3 లక్షల రూపాయలు ఇస్తానని పేర్కొందని, కానీ ఈ పథకంలో రాజకీయ జోక్యం లేకుండా గ్రామాలలో గ్రామసభల మాత్రమే ఎంపిక చేసి అర్హులను గుర్తించాలని డిమాండ్ చేశారు. రూ.3లక్షలు కాకుండా ఈ పథకం ద్వారా రూ.5లక్షలకు పెంచాలని అన్నారు. అసలే ఇండ స్థలాలు లేని పేదలకు స్థలాలు ఇచ్చి ఈ పథకాన్ని వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూములు కూడా గ్రామసభల ద్వారా మాత్రమే ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఎండి యాకూబ్, వడకపురం సారయ్య, చల్ల రాజిరెడ్డి, వడకాపురం వెంకన్న, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.