Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ది కాకతీయ ఖని లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్
నవతెలంగాణ-కోల్బెల్ట్
గతంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్దల సమక్షంలో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఘన్ పూర్ లారీ అసోసియేషన్, ట్రాన్స్ పోర్ట్, ది కాకతీయ ఖని లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నడుచుకుంటే ఏ సమస్య ఉండదని కాకతీయ ఖని లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసి యేషన్ కమిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని ది కాకతీ య ఖని లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా సంయుక్తంగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గతంలో ఘన్ పూర్ లారీ అసోసియేషన్ వారు లారీలను భూపాలపల్లి లారీ అసోసియేషన్లో 35 సంవత్సరాలుగా నడు పుకొని రెండు సంవత్సరాల క్రితం విడిపోయి స్వత హాగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిం దని అన్నారు. వారం రోజులుగా భూపాలపల్లి లారీ అసోసియేషన్, ఘనపురం లారీ అసోసియేషన్ మధ్య ఓసి -3, 8 ఇంక్లైన్ బొగ్గు లోడింగ్ విషయ మై జరుగుతున్న వర్గ పోరు అగ్రిమెంట్ జరగకపో వడం వల్ల సమస్య రెండు సంవత్సరాలుగా నెల కొంన్నారు. ఈ క్రమంలో లోడింగ్ వద్ద ఉద్రిక్త వా తావరణం నెలకొన్నదని వివరించారు. ఈ విషయ మై గతంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో పలుమార్లు చర్చించుకోవడం జరి గిందని అన్నారు. లోడింగ్ విషయమై ఘన్పూర్ అసోసియేషన్ వారు అగ్రిమెంట్ చేసుకోకపోవడం, పలుమార్లు భూపాలపల్లి లారీ ఓనర్లను దుర్భాషలా డడం, దాడికి ప్రయత్నం చేయడం పలు గొడవ లకు దారి తీయడం జరిగిందన్నారు. ఘన్ పూర్ లారీ అసోసియేషన్ వారు గత 35 సంవత్సరాలు గా భూపాలపల్లి అసోసియేషన్లో లారీలను నడుపుకున్నారని, భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఓసి కింద భూములు కోల్పో వడం జరిగిందని, ఇంతకుముందు పెద్దల సమ క్షంలో నిర్ణయించిన అగ్రిమెంటుకు ఇరువర్గాలు కట్టుబడితే సమస్య సద్దుమణుగుతుందని అన్నారు. ఈ విషయమై అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఘన్పూర్ అసోసియేషన్ నాయకులు , ట్రాన్స్ పోర్ట్ వారు సహకరించాలని సభ్యులు కోరారు.