Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషన్ చైర్మన్ పదవి మహిళకు కేటాయించాలి
- టీఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు పసుల రాంమూర్తి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రాంమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాజీపేట మండలం ద ర్గా కాజిపేట్ జాగీర్‌లోని అంబేద్కర్ భవన్లో టీఎంఎం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బందెల యాదలక్ష్మి అధ్య క్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో 25 శాతం ఉన్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు (ఎస్సీ/ఎస్టీ) రక్షణ, సంక్షే మం, రిజర్వేషన్ చట్టాల అమలులో జరుగుతున్న అ న్యాయాలను అధిగమించేందుకు కమిషన్‌ను ఆశ్ర యించే వర్గాలవారికి పూర్తిస్థాయి కమిషన్ లేక పోవడంతో సరైన న్యా యం జరగడం లేదు అని బీఆర్ఎస్పై మండిపడ్డారు ఎస్సీ, ఎస్టీల వర్గాలకు వెం టనే న్యాయం అందాలనే సదుద్దేశంతో జాతీయ స్థా యిలో ఉమ్మడిగా ఉన్న ఎ స్సీ,ఎస్టీ కమిషన్‌ను 2006లో జాతీయ ఎస్టీ కమి షన్, జాతీయ ఎస్సీ కమిషన్ అని రెండుగా విభజించి రెండు వర్గాలకు రాజ్యాంగ బద్ధంగా ఆ కమిషన్ తన సేవలను అందిస్తున్నామని చెబుతోంది కానీ నిబంధ నలకు అనుగుణంగా ఈ సేవలలు ఇరువర్గాలకు చేరడం లేదన్నారు. వీలైయినంత త్వరగా ఈ కమిష న్ చర్యలు చేపడితే మంచిదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరంగా అనివార్యమైన విభాగాల ను మాత్రమే అడాప్ట్ చేసుకొని ఎస్సీ/ఎస్టీ వర్గాలకు సంబంధించిన విభాగాలను అడాప్ట్ చేసుకోవడం మాత్రం వదిలేశారని ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ కమిషన్ విషయంలో జాప్యంచేస్తూ గత ఏడేండ్లుగా ఆ వర్గాల కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మ హిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తు న్న కవిత తెలంగాణ రాష్ట్రంలో ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని మహిళలకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో ట్యాంక్ బండ్ సమీపంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం బౌద్ధ సాంప్రదాయ ప్రకారము ఆవిష్కరించాలని అని కోరారు.
ఎస్సీ,ఎస్టీలపట్ల వివక్షతను ప్రదర్శించడం మా నుకొని హైకోర్టు తదుపరి విచారణ కంటే ముందే ని బంధనలకు అనుగుణంగా చైర్మన్, ఐదుగురు సభ్యు లతో పూర్తిస్థాయి కమిషన్ ఏర్పాటు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బందెల యశోద, బందేల కన కలక్ష్మి, కునమల్ల సుజాత, హన్మకొండ జిల్లా అధ్యక్షు డు రమేష్‌కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఉసిల్ల దయాకర్, వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి మన్నె శ్రీనివాస్, హనుమకొండ, వరంగల్ మహిళా అధ్యక్షు రాళ్లు బందెల రజిత, మన్నెలత గుడిపాటి విజయ లక్ష్మి, బండి సతీష్, పూనమల్ల సుచరిత, బందెల కళా వతి, బందెల రాజేశ్వరి, కునమల్ల వాణి, నెలకంటి సుభద్ర తదితరులు పాల్గొన్నారు.