Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు దక్కేంతవరకు పోరాటం ఆగదు అని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ ఫ్) హనుమకొండ జిల్లా కన్వీనర్ నీల రవీందర్, వరంగల్ పార్లమెంటరీ కో- కన్వీనర్ మాస్ సావిత్రి గారు అన్నారు.బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడంజరిగింది. ఈ సందర్భంగా నీల రవీందర్, మాస్ సావిత్రి మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని ఇంటి బందు పథకం ప్రవేశపెట్టి ప్రతి పేద కుటుంబానికి ఇంటి బందు పథకం కింద పది లక్షల రూపాయలు మంజూరు చేసి ఆదుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా 58, 59 జీవోను 2022 సంవత్సర వరకు వర్తింపచేసేలా జీవోను సవరించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఏ ఐ కె ఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హేన్ రెడ్డి హంస రెడ్డి, ఏ ఐ ఫ్ డి ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున,బిఎల్ఎఫ్ నాయకులు భూమయ్య, ఉదరు,రామ్మోహన్,బాణేష్ కళ్యాణి ,సుధాకర్, మొగిలి, పార్వతి, అశ్విని ,ఇంద్ర సదానందం, కాజా బాషా తదితరులు పాల్గొన్నారు.