Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు, పార్టీకి వారధులుగా కార్యకర్తలు పనిచేయాలి
- ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్
నవతెలంగాణ-హసన్‌పర్తి
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ విజ యా న్ని ఎవరు ఆపలేరని ఎమ్మెల్సీ సిరికొండ మధు సూద నాచారి, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌లు కా ర్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. మండల కేంద్రంలోని సాయిని గార్డెన్స్‌లో మండలంలోని ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్య కర్తల ఆత్మీయ సమ్మేళనం అంబరాన్నింటింది. కార్యక ర్తల్లో నూతనోత్తేజాన్నినింపేందుకుఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రసం గం ఆధ్యంతం ఉత్కంఠబరితంగా కొనసాగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మధుసూదన చారి మాట్లాడుతూ గత ప్రభుత్వాల కాలంలో తెలం గాణలో పరిస్థితి అధ్వన్నంగా ఉన్నాయని కనీసం తా గునీరు, సాగునీరు, రహదారులు, వసతి గృహాలలో భోజన సౌకర్యాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలకు సిద్దపడ్డారన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్య మాన్ని తన ఊపిరిగా భా వించి రాష్ట్రా న్ని సాధించు కు న్నామన్నారు. ప్రాణత్యా గాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రతి గ్రామం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. సంక్షే మ పథకాలు, అభివృద్ది, ఉపాధి అవకాశాలతో మూ డుపువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడు తూ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అజేయ విజ యాన్ని సొంతంచేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించా రు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజల మధ్యలోచర్చకు తీసుకురావాల ని అలాగే సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం తన స్వార్థరాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నదో ప్ర జలకు వివరించాలని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకం అని, పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుం దని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రేణికుంట్ల సునితప్రసాద్, ఎంపీపీ కేతపాక సునితరాజు, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, రైతు బందు మండలకోఆర్డినేటర్ అంచూరి విజరుకుమా ర్, మండల పార్టీ అధ్యక్షుడు బండి రజనీకుమార్, పీ ఏసీఎస్ చైర్మెన్లు, మార్కెట్ డైరెక్టర్లు, పీఏసీఎస్ డైరె క్టర్లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.