Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
ఏప్రిల్16,17,18న తిరుపతిలో జరుగు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్య దర్శి హెచ్.లింగన్న కార్మిక లోకానికి పిలుపు నిచ్చారు. దేశంలో135 కోట్ల జనాభా లో 45 కోట్ల మంది కార్మిక వర్గం వివిధ సెక్షన్ల క్రింద చీలిపోయి ఉన్నారనీ ఆయన తెలిపారు. ఐఎఫ్టియు అఖిల భారత మహాసభలు తిరుపతిలో జరుగనున్న నేప థ్యంలో ఇఫ్టూ జాతీయ కమిటీ ముద్రించిన పోస్టర్లను, కేసముద్రం మండల కేం ద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా లింగ న్న మాట్లాడుతూ కేవలం ఐదు కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత కలిగి 40 కోట్ల మంది కార్మికులు అభద్రతతో జీవితాలను వెల్లదిస్తున్నారని వారు తెలి పారు. అసంఘటిత రంగంలో ఉన్న 92 శాతం మంది కార్మికులకు, కార్మిక చట్టా లు అమలుకు నోచుకోలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్స్కు సరైన వేత నాలు లేక బ్రతుకు దినదిన గండంగా మారిందన్నారు. కార్మికులు పోరాడి సాధిం చుకున్న హక్కులను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి కార్పోరేట్ కంపెనీలకు నరేం ద్ర మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని తెలిపారు. మోడీ ఇచ్చిన ఎన్నికల హామీ లు ఉద్యోగ భద్రత, రెండు కోట్ల కొలువుల మాట నీళ్ల మూటగా మారిందన్నారు. చికాగో కార్మికుల రక్తతర్పణతో ఎనిమిది గంటల పని విధానం ప్రపంచవ్యాప్తంగా అమలు చేయబడుతుంటే, నేడు మోడీ సర్కార్ 12 గంటలకు పని విధానం తేవా లని ప్రయత్నిస్తోందన్నారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ అపర్ణ, బి.ప్రదీప్, పి.ప్రసాద్, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు పిన్నోజు చంద్రమౌళి, సజ్జనపు సరస్వతి, చిట్టిమల్ల అశోక్, శ్రీనివాస్, రమేష్, మంగమ్మ పాల్గొన్నారు.