Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీవైఎల్, పీఓడబ్ల్యూ డిమాండ్
నవతెలంగాణ-బయ్యారం
ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహి ళా సంఘం రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా మం గళవారం మండలంలోని ఇసులాపురం, కొత్తపేట, గంధంపల్లి రేషన్ షాపుల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి పివై ఎల్ జిల్లా నాయకులు కొలిపాక రవి మాట్లాడుతూ తెల్లరేషన్ కార్డు కలిగిన అర్హులైన పేదలందరికీ 12 రకాల సరుకులను ప్రభుత్వం ఉచితంగా అందించాల ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎం తో ఆర్భాటంగా కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించిం దని, దీని వలన పేదలకు భూములు ఇళ స్థలాలు కొ లువులు ఇండ్లు రేషన్ కార్డులు తదితర సమస్యలు ప రిష్కారం అవుతాయని అనుకుంటే ఆ సర్వేలను తుం గలోతొక్కి ప్రజల ఆశలను నీరుగార్చారన్నారు. టిఆర్ ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఇది మా టల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని అన్నా రు. పాలకులు ధరల మీద ధరలు పెంచుతూ ప్రజల పై అధిక భారాలు మోపుతున్నారని అన్నారు. అదే విధంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 1200 రూ పాయలకు పెంచి సబ్సిడీ ఎత్తివేసి అదానీ అంబానీ లకు లక్షల కోట్లు దోచిపెడుతున్నారని అన్నారు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అచ్చా దిన్ అని ఒకరంటే బంగారు తెలంగాణ అని మరొకటి అంటున్నారు కా నీ ప్రజలకు ఆహార భద్రత కల్పించే ప్రణాళికలు మా త్రం లేవన్నారు. పైగా ప్రజా పంపిణీ వ్యవస్థను నీరు గార్చే వైపుగా పాలకుల విధానాలు ఉన్నాయన్నారు. కేసీఆర్ పాలనలో ఇప్పటికే అర్హులైన లక్షలాదిమంది లబ్ధిదారులు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టు కున్న అవి నేటికీ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారన్నా రు. ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం అవి కూడా ఎఫ్సి ఐ గోదాంలో ముఖి పురుగులు పడ్డ బియ్యం ఇస్తున్నా రని అవి తిన్న ప్రజలు అనారోగ్యానికి గురి అవుతు న్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన పేదలందరికీ 10 కేజీల సన్న బియ్యం సరఫరా చేయాలని 12 రకాల సరుకులను ప్రజలకు ఉచితంగా అందించాల ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ నా యకులు కష్టాల శ్రీను,రేషన్ కార్డు లబ్ధిదారులు గట్టు దొరబాబు, పాలకుర్తి లక్ష్మయ్య, మునక బాలరాజు, కష్టాల యశోద, చెరుకునూరి అక్కమ్మ, కవిత, సుధా రాణి తదితరులు పాల్గొన్నారు.