Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
రజకుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబె ల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో గలఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మం త్రి దయాకర్ రావు రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర మూడవ మహాసభల కరపత్రాన్ని రజకసంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి మదర్‌తో పాటు రజక వృత్తిదా రుల సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తెలం గాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో రజకులు ఐక్యంగా ఉండా లని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నా యకులు, ముత్తారం మాజీ సర్పంచ్ భూమ రంగ య్య, లొంక ఐలయ్య, మండల అధ్యక్షులు చిట్యాల సమ్మయ్య, చిట్యాల యాకయ్య, దేవరుపులమండల అధ్యక్షులు రెడ్డిరాజుల రమేష్, రెడ్డిరాజుల కొండయ్య, కొడకండ్ల నాయకులు దూదిగాని లింగయ్య, రెడ్డి రాజుల గురువయ్య, లొంక మల్లేష్, దూదిగాని నాగ రాజు, కొండ్రతి ఉపేందర్, తాడూరి రాములు, లొంక రజాక్, జ్యోతి అంజయ్య, జ్యోతి యాదగిరి, చిట్యాల ఎల్లయ్య, చిట్యాల మధు, చిట్యాల వెంకన్న, చిట్యాల సంపత్, గుడికందుల రవి, యాకయ్య, లొంక ఐలోని తదితరులు పాల్గొన్నారు.