Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువులో మట్టి తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు
- 'నవతెలంగాణ' కథనంపై కదిలిన అధికారులు
నవతెలంగాణ-నర్సంపేట
రాజుపేటఏజన్సీ గ్రామ పరి ధిలోని మొండి కుంటను రెవె న్యూ, సాగునీటి ఇంజనీరు సంద ర్శించారు. మంగళవారం 'నవ తెలంగాణ' దినపత్రికలో ప్రచురి తమైన 'రాజుపేట ఏజన్సీలో మ ట్టి మాఫీయా' అనే కథనంపై అ ధికారులు స్పందించారు. ఈసందర్భంగా తహసిల్దార్ వాసం రాంమూర్తి మాట్లాడు తూ రాజుపేట 1/70 చట్టం అమలు ప్రాంతమని ఎక్కడ ఎలాంటి తవ్వకాలు చేపట్ట రాదన్నారు. సహజ నీటివనరులైన చెరువు కుంటల్లో తవ్వకాలు చేయడంపై విచారణ చేపట్టి మట్టి వ్యాపారులపై చట్ట పరమైన చర్యలు చేపడుతామన్నారు. మట్టి తవ్వకా లను రాత్రి వేళల్లో చేస్తున్నారని నిరంతరం పర్యవేక్షించాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రా జాక్, వీఆర్ఏ ఉపేందర్‌ను ఆదేశించారు. నియంత్రణకు ఇబ్బందులు ఎదురైతే 100 డయల్‌కు ఫోన్ చేసి పోలీసుల రక్షణ తీసుకోవాలన్నారు.