Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ భగవాన్‌దాస్ నేతృత్వంలో 1956లో నిర్మాణం
- త్వరలోనే భవనం పునర్నిర్మాణం చేపడుతాం
- దళితుల జీవితాల్లో అక్షరజ్యోతి వెలిగించింది
- కుమార్‌పల్లి బుద్ధభవన్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు
నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
దళితుల విద్యాజ్యోతిగా, అభ్యుదయ కార్యకలాపాల వే దికగా, వామపక్ష ఉద్యమాల ఊపిరిగా గుర్తింపు పొందిన కు మార్పల్లి బుద్ధభవన్ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు బుద్ధభ వన్ అభివృద్ధి కమిటీ ప్రకటించింది. హన్మకొండ కుమార్ పల్లిలోని బుద్ధభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. జనచైతన్యమే లక్ష్యంగా, ప్రధానంగా వందలు, వేల ఏళ్లపాటు చదువుకు దూరమైన దళితులు బతుకుల్లో అక్షరజ్యోతిని వెలిగించి, చై తన్యం తీసుకురావడమే ధ్యేయంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పోరాటాలు చేసిన ప్రముఖ కమ్యూనిస్టు నేత బీఆర్ భగవాన్‌దాస్ 1956లో బుద్ధభవన్ నిర్మాణం చేపట్టా రని, ఎవ్వరినీ ఒక్కరూపాయ ఆశించకుండా శ్రామిక జన శ్ర మదానంతో భవనం పూర్తిచేశారని తెలిపారు. ఈ బుద్ధభవ నం నుంచి ఎందరో ఉన్నతస్థాయికి చేరుకున్నారని, అనేక ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నారనిపేర్కొన్నారు. అలాగే డాక్ట ర్లుగా, ఇంజినీర్లుగా, పాత్రికేయులుగా, క్రీడాకారులుగా, రాజ కీయవేత్తలుగా ఎదిగారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ద ళితుల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఏప్రిల్14, 2023 సాయంత్రం 6: 30 నిమిషాలకు భారీ ఎత్తున సభా కార్యక్రమాలు మరియు సాంస్కతిక కార్యక్రమాలు ఉంటాయని ఈ కార్యక్రమాలకు ఉత్సవ కమిటీని ఏర్పాటుచేశారు ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షు లుగా యాళ్ల సంజరుకుమార్, సాదు వేణు, కోశాధికారిగా డాక్టర్ పీసరి లక్ష్మణ్‌లను నియమించారు అలాగే బీఆర్ భగ వాన్దాస్ స్ఫూర్తిని కొనసాగించడానికి బుద్ధ భవన్ పునర్ని ర్మాణం చేపట్టేందుకు పూనుకున్నట్లు తెలిపారు. దాతల సహ కారంతో అత్యంత అధునాత పద్ధతిలో ఈ ప్రాంత విద్యా ర్థులు, ఉద్యోగులు, ప్రజలకు ఉపయోగపడేలా నూతన భవ నం నిర్మించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యే వినరుభాస్కర్ పాల్గొంటారని కమిటీ ప్రతి నిధులు పేర్కొన్నారు.ఈసమావేశంలో బుద్ధ భవన్ అభివద్ధి కమిటీ అధ్యక్షులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కార్యదర్శి వంగల సుదర్శన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కూనమల్ల జితేందర్ నాథ్ బుద్ధ భవన్ విశ్లేషకులు డాక్టర్ రాజ సిద్ధార్థ మరియు విశ్లేషకులు గొర్రె రవికుమార్, సాంస్కతిక సారధి రాజ లింగం, అంకేసరపు సారయ్య ,ఎస్ గణేష్ బూజుగుండ్ల కిషన్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు యాళ్ల సంజరు, కార్యదర్శి సాదు వేణు, కోశాధికారి డాక్టర్ పీసరి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.