Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
జిల్లాలోని దళిత కాలనీ అన్నిటికీ మౌలిక వసతులు కల్పించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయం సందర్భంగా రెండవ రోజు సైకిల్ యాత్ర పరకాలలో ప్రారంభమైం ది అక్కడి నుండి రాజీపేట అంబేద్కర్ స్టా చ్ నుండి సిఎస్ఐ కాలనీ, మాదారం కా లనీలో ప్రయాణించిన తర్వాత అంబేద్క ర్ విగ్రహం దగ్గర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్బంగా కేవీపీఎస్ జిల్లాప్రధాన కార్యదర్శి మం ద సంపత్ మాట్లాడుతూ పరకాలలో వున్నా దళిత కాలనీలో సరైన మౌలిక వసతులు లేవు రోడ్లు గాని డ్రైనేజీలు గాని లేక దళితులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే ప్రభుత్వం దళితవాడ లకు మౌలిక వసతులు కల్పించాలి అ దేవిధంగా హనుమకొండ జిల్లాలో ఉన్న ప్రతి దళిత కుటుం బానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిం ది. రోజురోజుకు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దళితుల పైన దాడులు హత్యలు,అత్యాచారాలు చేస్తుందని అదేవిధం గా మనుధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.
కావున భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉండాలని చెప్పడం జరిగింది ప రకాల నుండి యాత్ర మొదలుకొని నర్సక్కపల్లి, రాయపర్తి, పులిగిల్ల, నడికుడ మండల కేంద్రం కు చేరుకుంది నడికుడ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు ఘనంగా ని ర్వహించడం జరిగింది జ్యోతిబాపూలే సమాజంలో ఉన్న అ సమానతలు తొలగిపోవాలని అంటరానితనం, కుల వివక్షత కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించారు. స్త్రీ పురు ష సమాన హక్కులకై లింగ సమానత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడారు. తనభార్య అయిన మహాత్మా సావిత్రిబాయి పూలేతో కలిసి స్త్రీ విద్యా హక్కుకై పోరాటాలు చేసి. స్త్రీల కోసం ప్రత్యేకపాఠశాల స్థాపించి స్త్రీలను విద్యా వంతులు చేసిన ఘనుడు అని కొనియాడారు.
వితంతు వివాహాలను ప్రోత్సహించి. సతీసహగమ నా నికి వ్యతిరేకంగా పోరాడారు. మహాత్మ జ్యోతిబాపూ పూలేను డాక్టర్ బిఆర్.అంబేద్కర్ తన గురువుగా స్వీకరించి ఆయన ను ఆదర్శంగా తీసుకొని అనేక ఉద్యమాలు అంబేద్కర్ నిర్వ హించారు. నేడు కేవీపీఎస్ కూడా ఆ మహనీయుల స్ఫూర్తి తో సమాజంలో జరుగుతున్న సామాజిక. ఆర్థిక. లింగ వివ క్షతలకు వ్యతిరేకంగా అనేకపోరాటాలు నిర్వహించేందుకు సమస్యలన్నీ ప్రత్యక్షంగా అధ్యయనం చేసేందుకు జిల్లా బైక్ యాత్ర చేపట్టిందని ఈ బైక్ యాత్రను అన్ని వర్గాల ప్రజలు. మేధావులు.
వివిధ ప్రజాసంఘాలు నైతిక మద్దతిచ్చి బలపరచవల సిందిగా కెవిపిఎస్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.