Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 కులాలకు కమ్యూనిటీ భవనాలు
- ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్
నవతెలంగాణ-హనుమకొండ / హనుమకొండ చౌరస్తా
కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వ వేత్త సామాజిక దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని వారి స్మారకార్థం కో టి రూపాయల వ్యయంతో పూలే భవన్ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197 వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఆయనకు ఘనంగా నివా ళులర్పించారు. అనంతరం అనంతరం సుశీల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో మాట్లాడుతూ అక్షరజ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతి రావుపూలే అని ఆయన కన్నకలలు సహకారం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీ ఆర్ పాలన ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే కొనియాడారు. కుల, లింగ వివక్షతకు తావులేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీ నవర్గాలు సామాజికంగా ఆర్థికంగాఅభివృద్ధి చెందుతాయని పూలే భావించార న్నారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు.
మహిళలు చదువుకుంటేనే...
మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొ దట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని కొనియాడారు. సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కషి చిరస్మరణీ యమ ని తెలిపారు. పూలే ఆశయాల సాధనలో భాగంగా సీఎం బడుగు బలహీన వర్గా ల విద్యార్థులకు నాణ్యతతోకూడిన విద్యను అందిస్తున్నారని స్పష్టం చేసారు. బల హీన వర్గాలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. వెనుకబడిన వర్గాలు అవకాశాలను అందిపుచ్చుకుని విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో మరింతగా ఎదగడమే పూలేకు నిజమైన నివాళులు అని పేర్కొ న్నారు. కోటి రూపాయల వ్యయంతో పూలె నైపుణ్య శిక్షణాభివద్ధి సంస్థ భవనాన్ని నిర్మించనున్నట్లు పూలె జయంతి వేడుకల్లో వేదికపైన ప్రకటించారు. ఇప్పటికే న్యూ శాయంపేట వద్ద స్థల ఎంపిక జరిగినట్లు తెలిపారు.
14 కులాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మించనున్నట్లు, ఒక్కో భవన నిర్మాణా నికి రూ.24 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు వినరుభాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు బీసీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వాన్ని ఒప్పించిన దాస్యం వినరు భాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య , కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ , జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కార్పొరేటర్లు, బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.