Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని షీటీం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్వాతి అన్నారు. లాల్ బహదూర్ కళాశాలలో మంగళవారం సైబర్ నేరాలపై షీటీమ్ అవగాహనా సదస్సు నిర్వహించా రు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ మహిళల పై జరిగే నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కా లంలో నేరాలఅదుపులో విద్యార్థులు కీలకపాత్ర పో షించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల నేరాలను అదు పు చేయవచ్చన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తి గత ఫోటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వ హించాలని, విద్యార్ధులు ఎవరి నుండైనా ఇబ్బందుల కు గురైనప్పుడు, ఎవరైనా అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్లైతే ధైర్యంగా షీ టీమ్ వారికి సమాచా రం ఇవ్వాలని, మా షీటీమ్ మొబైల్ నంబర్స్ సిపి వా ట్సాప్ నంబర్ 8712685257, సీఐ వాట్సాప్ నెం బర్ 8712685142, ఎస్ఐ వాట్సాప్ నెంబర్ 871 2685270 కి పిర్యాదు చేసిన వివరాలను గోప్యంగా ఉంచి నేరస్థులకు కౌన్సిలిం గ్ ఇచ్చి, చట్టరీత్యా చర్య తీ సుకుంటామని అన్నారు. విద్యార్థులు సమస్యలు ఎ దురైనప్పుడు తల్లిదం డ్రు లు, కుటుంబ సభ్యులు, ఉ పాధ్యాయు లతో పంచుకో వాలని, అలా పంచుకోవ డం ద్వారా నేరాలను ప్రాథ మిక దశలో నివారించవ చ్చని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్రావు మాట్లాడుతూ నేటికాలంలో అమ్మాయి లు చాలాజాగ్రత్తగా ఉండాలని ప్రయాణాలు చేసేట ప్పుడు అపరిచిత వ్యక్తులతో ఎలాంటి విషయాలను, ఫో న్నంబర్లను, ఫోటోలను షేర్చేసుకోవద్దని, సో షల్ మీడియాలో పరిచయమైన వారితో ఎలాంటి వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవద్దని, ప్రేమ పేరుతో వాళ్లుచెప్పే మాటలను నమ్మి తల్లిదండ్రులకు తెలుపకుండా తెలియని ప్రదేశాలకు వెళ్లకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ రాంరెడ్డి, కాలేజీ ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్స్ లలిత, శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.