Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయకుంటే టీపీఎస్ఎఫ్ పిలుపు మేరకు ఈ నెల 28 నుంచి సమ్మె చేపడతామని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బిర్రు పరమేశ్వర్ అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువగా పనులు నిర్వహించామని, మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు ప్రొబెషనరీ పీరియడ్‌ను పొడిగించినా పని చేశామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల వలే తమను గుర్తించి రెండేళ్ల కాలాన్ని ప్రొబెషనరీ పీరియడ్‌గా పరిగణించి, ఆ తర్వాత నుంచి పేస్కేల్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మురళి, మణికుమార్, మహేష్, రవి, వీరన్న, రాజు, రజిత, గీత, పావని పాల్గొన్నారు.